Cyber Fraud : సైబర్ నేరాలు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నిత్యం కొత్త రూపాల్లో మోసాలు చేస్తూ ప్రజలను దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు మరో స్థాయికి వెళ్లారు. తాజాగా సుప్రీం కోర్టు జడ్జి పేరు వినిపిస్తూ నకిలీ కోర్టు డ్రామాతో ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను మోసం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ మాజీ చీఫ్ ఇంజనీర్‌కు ఓ వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్‌లో “మీ పేరు ఓ కేసులో ఉంది, విచారణ సుప్రీం కోర్టులో జరుగుతోంది, జస్టిస్ స్వయంగా దీనిని పర్యవేక్షిస్తున్నారు” అంటూ నమ్మబలికారు. నకిలీ కోర్టు స్టాఫ్‌లా నటిస్తూ ప్రొఫెషనల్ వ్యవహారంతో వారు మాట్లాడటం, భయపెట్టడం మొదలుపెట్టారు.
US: లాస్ ఏంజిల్‌లో ఉధృతం అవుతున్న ఆందోళనలు.. భారీగా బలగాలు మోహరింపు
ఇంతలో “జస్టిస్ కేసు తీవ్రంగా ఉందని, వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని” చెబుతూ ఒక నకిలీ జడ్జి వీడియో కాల్‌లోకి వచ్చాడు. అతని హావభావాలు, వేషధారణ, మాటతీరు నిజమైన న్యాయమూర్తిలా ఉండటంతో బాధితుడు పూర్తిగా నమ్మిపోయాడు. పరినామంగా “ఈ కేసుకు సంబంధించి మీరు కొంత మొత్తంలో డబ్బులు ముందుగా సుప్రీం కోర్టు అకౌంట్లో జమ చేయాలి. కేసు ముగిసిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తాం” అని నకిలీ జడ్జి చెప్పాడు. నమ్మిన బాధితుడు తన ఖాతాలోని రూ. 1.5 కోట్లు (కోటిన్నర)ని సూచించిన ఖాతాకు బదిలీ చేశాడు.
అయితే అనంతరం ఎటువంటి సమాచారం రాకపోవడంతో , డబ్బులు తిరిగి రాకపోవడంతో అసలు విషయం తెలుసుకున్న బాధితుడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ప్రజల్లో జాగ్రత్త అవసరమని బలంగా గుర్తుచేస్తోంది. అధికారికమైన ప్రక్రియలు ఎప్పుడూ న్యాయబద్ధంగా జరుగుతాయని, ఎవరైనా ఇలా కాల్స్ చేసి డబ్బులు అడిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
Murder : మణికొండలో వృద్ధురాలి అదృశ్యం.. వికారాబాద్‌లో హత్య కలకలం