Betting Apps: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం 357 బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్లను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ చర్యలలో భాగంగా 2,400 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం, 166 మ్యూల్ అకౌంట్లను నిలిపివేయడం, మొత్తం ₹126 కోట్ల నగదును స్తంభింపజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 700కు పైగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వీటి ద్వారా ప్రజలను మోసగిస్తూ పెద్ద ఎత్తున డబ్బులను విదేశాలకు…
మధురానగర్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుంది ఓ ముఠా.. ఈ ముఠాను పట్టుకునేందుకు పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన ఐదుగురిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
VC Sajjanar : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చర్చనీయాంశంగా మారాయి. చాలా మంది యువత ఈ యాప్స్‌కు బానిసై అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఫలితంగా ఆర్థికంగా నష్టపోయి, కొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్‌ను అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఐపీఎస్ అధికారి, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అమాయక యువతను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్న సోషల్…
Sunny Yadav: తెలుగు మోటోవ్లాగర్ గా పేరొందిన యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ పోలీస్ స్టేషన్‌లో మార్చి 5న కేసు నమోదు అయింది. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ సంబంధించి అనేక మార్లు వాటిని ప్రమోట్ చేయడంతో సూర్యాపేట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఇదివరకే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు కూడా. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా…
Online Betting: కామారెడ్డిలో బెట్టింగ్ మోజు ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో 80 లక్షలకుపైగా కోల్పోయి అప్పుల బాధలో మునిగిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంజయ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్య శ్రీలత కన్నీరుమున్నీరవుతూ.. అప్పుల బాధల వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, బెట్టింగ్ యాప్‌లను తక్షణమే నిషేధించాలని కోరింది. అలాగే, ఎవరైనా అప్పు ఇచ్చే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి అంటూ వాపోయింది.…
Betting Apps : నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఉప్పెనలా పెరిగిపోతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఇన్‌ఫ్లుఎన్సర్లు వీటిని తెగ ప్రమోట్ చేస్తూ, అమాయక ప్రజలను మోసపూరితంగా ఆకర్షిస్తున్నారు. అయితే, ఇలాంటి యాప్స్‌ను ప్రచారం చేయడం భారతదేశ చట్టాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలై ఎంతో మంది తమ సంపదను కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోతున్నారు. కుటుంబ పోషణ కష్టమవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి, విడాకులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా…
VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎమ్‌డిగా పనిచేస్తున్న విసీ సజ్జనార్ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆయన విశేషాలను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రజలలో బెట్టింగ్ యాప్స్ పై అవగహన కోసమై పలు కీలక పోస్టులను చేస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితంలో నాశనం చేసుకోవద్దని ఆయన పలుమార్లు హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని చెబుతూనే.. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు…
Online Betting: వరంగల్ జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి అయ్యాడు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో అనే లైశెట్టి రాజు కుమార్ (26) అనే యువకుడు.. ఆన్ లైన్ బెట్టింగులో సుమారు 30 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Online Betting Suicide: ఈ మధ్యకాలంలో ప్రజలు కష్టపడి పనిచేసే డబ్బులు సంపాదించడం కన్నా అడ్డదారులు తొక్కడం, లేదా బెట్టింగ్ ద్వారా డబ్బులను సంపాదించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందులో విజయం సాధిస్తే సరి.. లేకపోతే, చివరకు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే మనం మీడియా ద్వారా అనేక ఆన్లైన్ బెట్టింగ్ లకు సంబంధించిన అనేక మరణాలను చూసే ఉన్నాము. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు…
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన నాగరాజా రెడ్డి బెట్టింగ్‌లకు పాల్పడి అధిక మొత్తంలో డబ్బులను పోగొట్టుకున్నాడు. అప్పులు కూడా ఎక్కవయ్యాయి. దీంతో.. అప్పుల బాధ భరించలేక రెండ్రోజుల క్రితం (శుక్రవారం) తన కుటుంబంతో కలిసి ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో శుక్రవారం భార్యాభర్తలిద్దరూ మృతి చెందగా.. నిన్న చికిత్స పొందుతూ కుమార్తె సునీత మృతి చెందింది. కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూ…