Betting Apps: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం 357 బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్లను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ చర్యలలో భాగంగా 2,400 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం, 166 మ్యూల్ అకౌంట్లను నిలిపివేయడం, మొత్తం ₹126 కోట్ల నగదును స్తంభింపజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 700కు పైగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వీటి ద్వారా ప్రజలను మోసగిస్తూ పెద్ద ఎత్తున డబ్బులను విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ప్రధానంగా మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ, హవాలా మార్గంలో డబ్బును మళ్లిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ల పై జీఎస్టీ ఇంటెలిజెన్స్ దృష్టి సారించింది. వీరు ఈ యాప్స్ ప్రమోషన్ ద్వారా అమాయక ప్రజలను మోసగించారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. 166 మ్యూల్ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో పాటు ₹126 కోట్ల రూపాయలను నిలిపివేశారు. బెట్టింగ్ యాప్స్ హవాలా మనీ ల్యాండ్రింగ్ ద్వారా డబ్బులను విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తింపు. మ్యూల్ అకౌంట్లను ఉపయోగించి డబ్బులను చిత్తుగా తరలిస్తున్న ముఠాలను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం, డిజిటల్ మోసాలను అరికట్టేందుకు త్వరలో కొత్త చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే ఆర్బీఐ, జీఎస్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ వ్యవహారాన్ని పక్కాగా విచారిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా బెట్టింగ్ వెబ్‌సైట్లు, హవాలా లావాదేవీల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
Delimitation: తొలి ‘‘డీలిమిటేషన్’’ సమావేశంలో 7-పాయింట్ల తీర్మానం.. అవి ఏంటంటే..