Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tsrtc Md Sajjanar Interesting Tweet On Online Betting Apps Illegal Promotion India

Betting Apps : ఇన్‌ప్లూయెన్స‌ర్లు జర పైలం.. ఇలా చేస్తే ఇక మీరు జైలుకే

NTV Telugu Twitter
Published Date :January 30, 2025 , 4:30 pm
By Gogikar Sai Krishna
  • ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల‌ను ప్ర‌మోట్ చేయడంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ట్వీట్‌
  • సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్లపై కేంద్ర ప్ర‌భుత్వం గ‌తంలోనే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది
  • వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్ర‌కారం నేరం. : వీసీ సజ్జనార్‌
Betting Apps : ఇన్‌ప్లూయెన్స‌ర్లు జర పైలం.. ఇలా చేస్తే ఇక మీరు జైలుకే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Betting Apps : నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఉప్పెనలా పెరిగిపోతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఇన్‌ఫ్లుఎన్సర్లు వీటిని తెగ ప్రమోట్ చేస్తూ, అమాయక ప్రజలను మోసపూరితంగా ఆకర్షిస్తున్నారు. అయితే, ఇలాంటి యాప్స్‌ను ప్రచారం చేయడం భారతదేశ చట్టాల ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలై ఎంతో మంది తమ సంపదను కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోతున్నారు. కుటుంబ పోషణ కష్టమవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగి, విడాకులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి , పేద కుటుంబాలకు బెట్టింగ్ మహమ్మారిలా మారింది.

MLC Kavitha : కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయి

భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నవారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అప్పుల బాధ భరించలేక, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవలే దేశవ్యాప్తంగా అనేక మంది యువకులు, ఉద్యోగులు బెట్టింగ్ వల్ల తమ ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు వెలుగుచూశాయి. భారతదేశంలో బెట్టింగ్ ప్రధానంగా చట్ట విరుద్ధమైనదే. ఇలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేయడం లేదా వీటిలో ఆడించడం జైలుశిక్ష , భారీ జరిమానాలకు దారి తీస్తుంది. ఇటీవల, పలు రాష్ట్రాలు బెట్టింగ్ యాప్స్‌పై నిషేధాన్ని విధించాయి.

అయితే.. ఈ విషయంపై తాజా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల‌ను ప్ర‌మోట్ చేసే సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్లపై కేంద్ర ప్ర‌భుత్వం గ‌తంలోనే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిందని, యువతను ఆన్‌లైన్ పందాలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్ర‌కారం నేర‌మ‌ని హెచ్చ‌రించిందని ఆయన పేర్కొన్నారు. అయినా కొంత మంది ఇన్‌ప్లూయెన్స‌ర్లు త‌మ స్వలాభం కోసం ఇష్టారీతిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల‌ను ప్ర‌మోట్ చేస్తున్నారని, గుర్తుపెట్టుకోండి మీరంతా శిక్షార్హులే అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. మాకు ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.. మేం ఏం చేసిన న‌డుస్తుంద‌ని అనుకుంటే పొర‌పాటే అని, స‌మాజ శ్రేమ‌స్సును దృష్టిలో పెట్టుకుని ఇప్ప‌టికైనా ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల‌ను ప్ర‌మోట్ చేయ‌డం ఆపండని హితవు పలికారు. స్వార్థానికి పోయి అమాయ‌కుల‌ ప్రాణాల‌కు బాధ్యులు కాకండని ఆయన తెలిపారు.

Nani: నాని ఇంత చీప్ పని చేస్తావా.. నిర్మాత ఫైర్!

ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ ల‌ను ప్ర‌మోట్ చేసే సోష‌ల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్లపై కేంద్ర ప్ర‌భుత్వం గ‌తంలోనే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

యువతను ఆన్‌లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్ర‌కారం నేర‌మ‌ని హెచ్చ… pic.twitter.com/WSuRzwWNeQ

— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 30, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • betting Apps
  • cyber crime
  • Financial Loss
  • Gambling Ban
  • Legal Issues

తాజావార్తలు

  • Israel Strikes: ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..

  • Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు..

  • Astrology: జూన్‌ 14, శనివారం దినఫలాలు

  • AP News : దేవాదాయశాఖ ఉద్యోగుల బదిలీలు కూటమిలో కుంపట్లు పెట్టాయా..?

  • Fake Baba : గుప్త నిధుల పేరిట మోసం.. దొంగ బాబాలు అరెస్ట్‌

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions