Amit Shah: వచ్చే టర్మ్‌లో యూసీసీ, జమిలి ఎన్నికలు అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత వచ్చే 5 ఏళ్లలో దేశం మొత్తం యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని అమలులోకి తెస్తామని కేంద్ర హోమంత్రి అన్నారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాల్సిన సమయం ఆసన్నమైందని, మోడీ ప్రభుత్వం తరువాతి కాలంలో ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ అమలు చేస్తుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన చెప్పారు. ఏకకాల ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గుతాయని అన్నారు.
Read Also: PM Modi: చిన్నప్పుడు కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగాను.. చాయ్‌తో ప్రత్యేక అనుబంధం..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
యూసీసీ అనేది రాజ్యాంగ నిర్మాతలు స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి మనకు, మన పార్లమెంట్‌కి, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు మిగిలి ఉన్న బాధ్యత అని షా చెప్పారు. ‘‘రాజ్యాంగ సభ మనకు నిర్ణయించిన మార్గదర్శక సూత్రాలలో యూనిఫాం సివిల్ కోడ్ కూడా ఉంది. ఆ సమయంలో కేఎం మున్షీ, రాజేంద్ర బాబు, అంబేద్కర్ జీ వంటి న్యాయ పండితులు లౌకిక దేశంలో మతం ఆధారంగా చట్టాలు ఉండకూడదని చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్ ఉండాలి’’ అని అన్నారు.
యూసీసీ 1950ల నుంచి బీజేపీ ఎజెండాలో ఉందని, ఇటీవల ఉత్తరాఖండ్‌లోని బీజేపీ సర్కార్ యూసీసీని అమలు చేసిందని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ ఒక భారీ సామాజిక, చట్టపరమైన,మతపరమైన సంస్కరణ అని తాను నమ్ముతున్నట్లు షా చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేసిన చట్టం సామాజిక మరియు చట్టపరమైన పరిశీలనకు లోనైందని, మత పెద్దలను కూడా సంప్రదించారని ఆయన అన్నారు. వచ్చే 5 ఏళ్లలో యూసీసీ అమలవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏకకాల ఎన్నికల కోసం రామ్ నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేశామని, దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని అమిత్ షా అన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!