Nitish Kumar: “వన్ నేషన్-వన్ ఎలక్షన్”కి నితీష్ పార్టీ మద్దతు.. అగ్నిపథ్ స్కీమ్‌ని మాత్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈ నెల 9న ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, గత రెండు పర్యాయాలుగా కాకుండా, ఈ సారి బీజేపీ ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, తెలుగుదేశం, శివసేనలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 543 సీట్లకు గానూ 292 గెలుచుకుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272కి తక్కువగా 240 సీట్లను సాధించింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.
Read Also: RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారాన్ని స్వదేశానికి ఎందుకు తీసుకువస్తుంది..?
Also Read
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
- SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
బీజేపీ లక్ష్యాలుగా ఉన్న యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ), వన్ నేషన్-వన్ ఎలక్షన్ వంటి వాటి అమలుపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే, ఇప్పటికే జేడీయూ యూసీసీకి మద్దతు ఇచ్చినట్లు తెలస్తోంది. అయితే సైన్యం కోసం తీసుకువచ్చిన ‘‘ అగ్నిపథ్’’ స్కీమును సమీక్షించాలని కోరుతోంది. ఇప్పటికే జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ, అగ్నిపథ్ పథకంపై ఆగ్రహం ఉందని, ఇది ఎన్నికల్లో కనిపించిందని చెప్పారు. అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టిన సమయంలో సాయుధ దళాల్లో పెద్ద వర్గం అసంతృప్తి వ్యక్తం చేసిందని, వారి కుటుంబాలు నిరసన వ్యక్తం చేశాయని, దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. జేడీయూ వన్ నేషన్ వన్ ఎలక్షన్, సివిల్ కోడ్‌కి అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
సాయుధ బలగాలను సన్నద్ధం చేయడానికి రక్షణ వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్రం 2022లో అగ్నిపథ్ స్కీమ్ తెచ్చింది. ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్‌లో నాలుగు సంవత్సరాల స్వల్పకాలిక ఒప్పందంపై సిబ్బందిని నియమిస్తారు. ఇందులో శాశ్వతంగా 15 ఏళ్లు కొనసాగడానికి 25 శాతం మంది మాత్రమే అనుమతించబడతారు. ఈ పథకం బీహార్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానాల్లో భారీ నిరసనలకు కారణమైంది.
- Tags
- agnipath scheme
- bjp
- JDU
- NDA
- nitish kumar
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
-
Zodiac Signs : దసరా వేళ ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
-
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
-
Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
-
Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!