Rahul Gandhi: దేశవ్యాప్తంగా ప్రస్తుతం రాజకీయాలు అన్నీ ముందుస్తు ఎన్నికలు, జమిలీ ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారనే చర్చ మొదలైంది. దీనికి అనుగుణంగానే కేంద్రం మాజీ రాష్ట్రపతితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే ఒకే దేశం-ఒకే ఎన్నికపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇండియా కూటమికి భయపడే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని విమర్శిస్తున్నాయి.…
YV Subba Reddy: మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం జమిలీ కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామన్న ఆయన సీఎం జగన్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తిరిగి జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడ లేవని సుబ్బారెడ్డి కితాబిచ్చారు. ఇక…
వన్ నేషన్-వన్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శనివారం (సెప్టెంబర్ 2) నోటిఫికేషన్ విడుదల చేసింది. రామ్‌నాథ్ కోవింద్ ఛైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు జనసేన మద్దతిస్తోంది అని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై పవన్ కళ్యాణ్ తో కేంద్ర పెద్దలు చర్చించారు.
ఒకే దేశం- ఒకే ఎన్నిక' అనే చర్చ దేశంలో జోరందుకుంది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 1న, కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
One nation-One election: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం పలు రకాల ఊహాగానాలకు తెరతీసింది. ముఖ్యంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో కేంద్ర జమిలీ ఎన్నికలపై ఓ
Parliament Special session: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసి మూడు వారాలే అయింది. తిరిగి పార్లమెంట్ సెషన్ డిసెంబరులో ఉండాలి. అయితే సంవత్సరాంతంలో జరగాల్సిన శీతాకాలు కాకుండా మోడీ సర్కార్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇవి ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు నిరవధికంగా జరగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సెషన్ దేని కోసం అన్నది ఆయన…
Parliament Session: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతుందా..? ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనుందా..?