ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అలకనంద నదిలో 18 మందితో వెళ్తున్న బస్సు పడిపోయింది. ఒకరు చనిపోగా.. 11 మంది గల్లంతయ్యారు. రుద్రప్రయోగ జిల్లాలోని ఘోల్తీర్‌లో ఈ ఘటన జరిగింది. గాయపడ్డ ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన అధికారులు.. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: నేడు కొణిదెల గ్రామానికి పవన్ కళ్యాణ్.. సొంత నిధులతో..!
గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ.. 18 సీట్ల గల బస్సు నదిలో పడిపోయిందని.. ఒకరు చనిపోగా. 11 మంది గల్లంతయ్యారని చెప్పారు. ఏడుగురు గాయపడినట్లు పేర్కొన్నారు. సహాయక చర్య కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు, పరిపాలన బృందాలు రంగంలోకి దిగినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Instagram Reel Stunt: రిల్స్ కోసమే రిస్క్? శంకర్‌పల్లిలో రైల్వే ట్రాక్ మీద కారు!
#WATCH | Uttarakhand | One person dead, seven injured after an 18-seater bus falls into the Alaknanda river in Gholthir of Rudraprayag district. Teamsof SDRF, Police and Administration conduct search and rescue oeprationd
Video source: Police pic.twitter.com/dgdznAc0ck
— ANI (@ANI) June 26, 2025