ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు ఎప్పటికప్పుడు తగిన రిప్లై ఇస్తూ వార్తల్లో నిలుస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల హరీష్ ఓమిక్రాన్ వ్యాప్తి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక ప్రముఖ వైద్య నిపుణుడి వీడియోను పంచుకున్నారు. వైరస్ వ్యాప్తి పట్ల సామాన్యులు మరింత…
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో ఎంతో మంది జీవితాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. మొన్నటి వరకు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడం, ఒమిక్రాన్ ఇండియాలో వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో సైతం కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగతూ వస్తున్నాయి. అయితే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఉస్మానియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న…
2022 వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు బీజింగ్ సిద్ధమయింది. ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. బీజింగ్‌ను జీరో కరోనా జోన్‌గా తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు ఒమిక్రాన్ టెన్సన్ పట్టుకుంది. ఒమిక్రాన్ కేసులు ఆ దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. కట్టడి చేసేందుకు ఇప్పటికే బీజింగ్ చుట్టుపక్కల ఉన్న నగరాలలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఎలాగైనా వింటర్ ఒలింపిక్స్‌ను నిర్వహించి తీరాలని చైనా పట్టుబడుతున్నది. ఇదిలా ఉంటే, బీజింగ్‌కు సమీపంలో ఉన్న షియాన్…
ఢిల్లీని కరోనా వణికిస్తోంది. కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పార్లమెంట్‌లో 400 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో పార్లమెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ టెస్టులు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేగింది. సుప్రీంకోర్టులో కరోనా కేసులు వరసగా బయటపడుతున్నాయి. కోర్టులో 3 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 150 మందికి కరోనా నిర్ధారణ జరిగింది. Read: ఢిల్లీ బాటలో రాజస్థాన్… ప్రజలకు…
ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ తో పాటు వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు రాజస్థాన్ కూడా అడుగులు వేస్తున్నది. రాజస్థాన్‌లో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో 5660 కొత్త కేసులు నమోదవ్వగా ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో 19,467 యాక్టీవ్ కేసులు ఉండగా, 24 గంటల్లో 358 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అశోక్ గెహ్లాట్ సర్కార్…
కరోనా భయం తొలగిపోలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్యారోగ్యశాఖ అప్రమత్తత పై ప్రగతి భవన్ లో ఆదివారం సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు ఇదే సందర్భంలో రోడ్లు భవనాలు , ఇరిగేషన్…
కరోనా బూస్టర్ డోస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గతంలో రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో… బూస్టర్ డోసుగా కూడా దాన్నే తీసుకోవాలని స్పష్టం చేసింది. మిక్స్ అండ్ మ్యాచ్ వద్దని తేల్చి చెప్పింది మోడీ సర్కార్. మూడో డోసుల విషయంలో మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. థర్డ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసులు 2లక్షలకు చేరువలో వున్నాయి.…
ముంబై నగరలంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో 25 వేలకు పైగా కేసులు నమోదవ్వడంతో కరోనాను కట్టడి చేసేందుకు సిద్దమయింది. ఇళ్ల సముదాయాల్లో 20 శాతానికి మించి కరోనా కేసులు నమోదైతే ఆ బిల్డింగ్‌ను లేదా బిల్డింగ్ సముదాయాలను సీజ్ చేయాలని ముంబై నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల వ్యవధిలో సుమారు 300 లకుపైగా భవనాలను…
భారత్‌లో కరోనా మరోసారి పడగవిప్పుతోంది.. గత ఐదారు రోజులుగా యమ స్పీడ్‌గా పెరిగిపోతున్నాయి పాజిటివ్ కేసులు.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ ఏకంగా 18 వేలకు పైగా కేసులు పెరిగాయి.. అయితే, సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. భారత్‌లోనూ ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాతే రోజువారి కేసులు మరోసారి కోవిడ్ మీటర్ పరుగులు పెడుతోంది.. ఇక, భారత్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమైందని.. ఇప్పటికే 15కు పైగా రాష్ట్రాల్లో…
భారత్‌లో కరోనా కల్లోలం మళ్లీ మొదలైంది.. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం భారత్‌పై ఏ స్థాయిలో ఉందో.. వరుసగా వెలుగు చూస్తున్న కొత్త కేసులే చెబుతున్నాయి.. గత ఐదు రోజులుగా ప్రతీ రోజు భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తూ.. కరోనా మీటర్ పరుగులు పెడుతోంది… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 327 మంది కోవిడ్…