దేశంలో కరోనా కేసుల స్వల్ప తగ్గుదల నమోదైంది. దేశంలో తాజాగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు.కర్ణాటకలో కొత్తగా 27,156 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా 14 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పటి…
ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రముఖ వైరాలజిస్ట్ టి జాకబ్ జాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ దారితప్పి పుట్టిన ఓ వేరియంట్ అని అన్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌కు వూహన్‌లో పుట్టిన డి614 జీ వేరియంట్ కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ఒమిక్రాన్‌కు డి 614 జీ వేరియంట్ ముత్తాత వంటిదని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తంమీద రెండు రకాల వేరియంట్లు ఉన్నాయని అన్నారు. అందులో ఒకటి పాత వూహాన్ వేరియంట్ దాని ఉత్పరివర్తనాలు కాగా, రెండోది ఒమిక్రాన్…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం నమోదైన కేసుల కంటే సోమవారం రోజున 5 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో తాజాగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం…
దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కేసులు ఇప్పటి వరకు అదుపులోకి రాలేదు. తాజాగా ఢిల్లీలో 28,867 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో 31 మంది మృతి చెందారు. 24 గంటల్లో కరోనా నుంచి 22,121 మంది కోలుకున్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 94,160 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఢిల్లీలో…
కరోనా పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చే దేశం చైనా. చైనాలోనే మొదట కేసులు బయటపడ్డాయి. అయితే, చైనా వాస్తవాలను దాచిపెట్టడంతో ప్రపంచం ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సార్స్ కొవ్ 2, డెల్టా, ఇప్పుడు ఒమిక్రాన్‌తో దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రపంచంలో కేసులు పెరుగుతున్నా చైనాలో కేసులు పెద్దగా లేవని, ఒకటి రెండు కేసులు వస్తున్నా వాటిని కఠినమైన లాక్‌డౌన్ వంటివి అమలు చేసి కట్టడి చేస్తున్నామని చైనా చెబుతూ వస్తున్నది. అక్కడి మీడియా కూడా…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని మోడీ ఈరోజు దేశంలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా హాజరయ్యారు. దేశంలో థర్డ్ వేవ్ దృష్ట్రా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చిస్తున్నారు. వ్యాక్సినేషన్ పైకూడా ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. అయితే, ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కాలేదు. ఆయన…
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. 24 గంటల్లో 47,884 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,348 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,92,227 కి చేరింది. ఇందులో 20,63,516 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,204 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 14,507 మంది మృతి చెందినట్టు హెల్త్…
ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఢిల్లీ సర్కార్ నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నది. ఈ కర్ఫ్యూల వలన కొంత వరకు ఉపయోగం ఉన్నట్టు కనిపిస్తున్నది. వీకెండ్ కర్ఫ్యూ తరువాత కొంతమేర కరోనా ఉధృతి తగ్గింది. అయితే, ఈ జనవరిలోనే కరోనా పీక్స్ దశకు చేరుకునే అవకాశం ఉందని, కరోనా కేసులు రెండు రోజులు వరసగా తగ్గితే ఆంక్షలను ఎత్తి వేస్తామని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పష్టం చేశారు. కేసులు…
కరోనా మహమ్మారి విజృంభన రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. కాలేజీల్లో, ఆఫీసుల్లో, పాఠశాలల్లో ఆఖరికి ఆసుపత్రుల్లోని వైద్యులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇలా ఎక్కడా చూసినా కరోనా రక్కసి రెక్కలు చాస్తోంది. అయితే థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను తీవ్రతరం చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. తాజాగా ఐఐటీ హైదరాబాద్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌లోని విద్యార్థులకు…