అమెరికా అంటువ్యాధుల కమిటీ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కరోనా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ కేసులు అమెరికాలో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను అందిస్తున్నా కేసులు పెరుగుతుండటంపై సర్వత్రా అందోళన పెరుగుతున్నది. కరోనాను సమూలంగా అంతం చేయడం అసాధ్యమని డాక్టర్ ఫౌచీ పేర్కొన్నారు. కరోనాతో కలిసి జీవించాల్సిందే అని కుండబద్దలు కొట్టారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరిలో వైరస్ కనిపిస్తుందని, అయితే, వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఆ వ్యాక్తుల్లో వ్యాధి తీవ్రత…
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు… ఇది సామెతే అనుకుంటే పొరపాటే. నిజజీవితంలో కూడా ఇది ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. 2109 వరకు ఆర్థిక, సాంకెతిక రంగాల్లో ప్రపంచదేశాలు పోటీ పడ్డాయి. అయితే, 2019 డిసెంబర్‌లో చైనాలో కరోనా బయటపడింది. వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ కరోనా ల్యాబ్ నుంచి వచ్చిందని అమెరికాతో సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అందుకు చైనా ఒప్పుకోవడం లేదు. జంతువుల నుంచి మనిషికి సోకిందని చెబుతూ వచ్చింది. కరోనా పుట్టుకకు…
భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 1,94,720 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే ఈరోజు కేసుల సంఖ్య 15.8 శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, దేశంలో పాజిటివిటీ రేటు పది శాతం దాటిపోయింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 9,55,319 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 442 మంది మృతి చెందగా, 60,405 మంది కోలుకున్నట్టు కేంద్ర…
కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాను అధికమించితే మరింత ప్రమాదమని, థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టాలి అంటే తప్పని సరిగా మూడు అంశాలను ఫాలో కావాలని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్‌కే అరోడా…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వీరవిహారం చేస్తోంది. అందుకే నైట్ కర్ఫ్యూ విధించింది. సంక్రాంతి సందర్భంగా రిలాక్సేషన్ ఇచ్చింది. ఇదే ఒమిక్రాన్, కరోనా మహమ్మారికి కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఏపీలోని శ్రీకాకుళంలో కరోనా బాధితులు లేని ఇల్లు లేదు . ఇబ్బంది పడని ఫ్యామిలీ కనిపించదంటారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లో జనాల జీవితాలను ఛిద్రం చేసింది ఈ కోవిడ్ . అయినా ప్రజల తీరులో మార్పు రాలేదు. గతాన్ని మరచిన ప్రజలు, విచ్చలవిడిగా కోవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు.…
అమెరికాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు 13 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. సోమవారం రోజున 1.32 లక్షల మంది కరోనాతో చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు. రాబోయే వారం పదిరోజుల్లో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నది. సుమారు 2 నుంచి మూడు లక్షల మంది ఆసుపత్రుల్లో చేరతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొలరాడో, లూసియానా, మేరిలాండ్,…
ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతీ రోజూ ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలే పార్లమెంట్‌లో 400 మంది సిబ్బందికి కరోనా సోకింది. పార్లమెంట్‌లో పనిచేస్తున్నా సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న 3వేల మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దీనికోసం ప్రత్యేక కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. Read: మనిషి…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు లక్ష దాటిపోతున్నాయి. తాజాగా దేశంలో 1,68,063 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 277 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 8,21,446 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు 152 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు 6.4 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ తో…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కరోనా పట్టి పీడిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో స్టార్లు కరోనా బారిన పడుతుండడం అభిమానవులకు భయాందోళనలను కలిగిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా పలు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ స్టార్ హీరోయిన్ శోభన ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ”…
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. సౌతాఫ్రికాలో ప్రారంభమైన ఒమిక్రాన్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. యూరప్, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ మరణమృదంగం చేస్తున్నది. అయితే, ఇప్పుడు మరో వేరియంట్ వెలుగుచూసినట్టు వార్తలు వస్తున్నాయి. డెల్టా, ఒమిక్రాన్ రెండు వేరియంట్లు కంబైన్డ్‌గా ఒకే మనిషిలో గుర్తించారు. ఇలాంటి కేసుల ఇప్పటి వరకు 25 నమోదైనట్టు సైప్రస్ వైరాలజీ శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈ డబుల్ వేరియంట్ కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని సైప్రస్…