కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాను అధికమించితే మరింత ప్రమాదమని, థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టాలి అంటే తప్పని సరిగా మూడు అంశాలను ఫాలో కావాలని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్‌కే అరోడా తెలిపారు.
Read: నుమాయిష్ దగ్గర కూలిన భారీ వృక్షం
ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు నైట్ లాక్‌డౌన్ వంటి అంశాలు కరోనా కట్టడిని తోడ్పడతాయని అన్నారు. అనవసరమైన రద్దీని తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. ఇక ఒమిక్రాన్ వేరయంట్‌లోనూ మూడు నాలుగు రకాలు కనిపిస్తున్నాయని, వాటిని గుర్తించే విధానం వేరుగా ఉన్నా, వాటి నుంచి సంక్రమించే వ్యాధి కారకత ఒకటిగానే ఉందని తెలిపారు. దేశంలో థర్డ్ వేవ్ విజృంభిస్తోందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే ప్రమాదకరం అని తెలపారు.