భారతదేశంలో కోవిడ్19 మహమ్మారి థర్డ్‌వేవ్ జనవరి 23 వరకు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని, రోజువారీ కేసులు నాలుగు లక్షల మార్కు కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ శాస్త్రవేత్త తెలిపారు. ఢిల్లీ, ముంబై మరియు కోల్‌కతా గత ఏడు రోజుల్లో కేసుల సంఖ్య ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్, సూత్ర కోవిడ్ మోడల్‌తో అనుబంధించబడిన పరిశోధకులలో ఒకరైన మనీంద్ర అగర్వాల్ అన్నారు. మహమ్మారి ప్రారంభం…
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. యూరప్ దేశాల్లో కాస్త శాంతించినా అమెరికాలో కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగిపోతున్న నేపథ్యంలో అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచంలోని 22 దేశాలకు ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించింది. 80కి పైగా దేశాలను వెరీ హై రిస్క్ జోన్ దేశాల జాబితాలో సీడీసీ చేర్చింది. కాగా మరో 22 దేశాలను హైరిస్క్ దేశాల జాబితాలో చేర్చింది. లెవల్ 4 దేశాల జాబితాలో ఉంచిన దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణించవద్దని…
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ సివియర్ కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక దేశాలు ఒమిక్రాన్ ను లైట్‌గా తీసుకుంటున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ కీలక హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు తక్కువగా ఉంటాయని, తీవ్రత తక్కువగా ఉందని తక్కువ చేసి చూడడం పొరపాటే అవుతుందని, ఒమిక్రాన్ వేరియంట్ ఎలా విరుచుకు పడుతుంతో ఇప్పుడే అంచనా వేయలేమని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది. సార్స్ కోవ్ 2 వైరస్‌ను…
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయానా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానసర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు ఆంక్షలను పొడిగించారు. ప్రస్తుతం జనవరి 31 వరకు నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో డీజీసీఏ ఆంక్షలను మరోసారి పొడిగించాలని నిర్ణయించింది. ఒమిక్రాన్‌కు ముందు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో డిసెంబర్ 15 నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ…
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న సమయంలో.. పలు రకాల రీసెర్చ్‌లు కోవిడ్ తీవ్రతను అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. దేశంలో క్రమంగా కోవిడ్ మీటర్ మరోసారి పైకి పరుగులు పెడుతోన్న సమయంలో.. ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎబ్బీఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది ఎస్బీఐ రీసెర్చ్.. ఇప్పటికే…
కరోనా మహమ్మారి తగ్గేదేలే అంటోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది కరోనా రక్కసి ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభన ఇప్పటికే భారత్‌లో మొదలైంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య భారీ పెరిగిపోయింది. రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదువుతోంది. అయితే బ్లాక్ ఫంగస్ కేసులు కూడా మళ్లీ వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగించే విషయం. యూపీలో తొలి…
కరోనా వైరస్ విజృంభన కోనసాగుతూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాకముందు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలను కఠినతరం చేసింది. ఫస్ట్, సెకండ్ వేవ్‌లతోనే రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూసాయి. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికి గతంలో 14 రోజులు సెలవులను ప్రకటించిన సింగరేణి సంస్థ.. ఇప్పుడు 7రోజులు మాత్రమే కరోనా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్రం తాజాగా…
కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే పోలీసులు కరోనా బారినపడుతుండగా.. ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం రేపుతోంది. సాధారణ పరిపాలన, విద్యాశాఖలోని పలు విభాగాల్లో 15 మందికి కరోనా సోకింది. విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. జీఏడీ ప్రిన్సిపాల్ సెక్రటరీ పేషీలో ముగ్గురు పీఎస్‌లతో పాటు మరికొందరూ కరోనా…
కరోనాకు పుట్టినిల్లైన చైనా జీరో వైరస్ ను సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. సార్స్‌కోవ్ డీ వైరస్ వూహాన్‌లో పుట్టలేదని, ఇటలీ నుంచి వచ్చిందని కొన్నాళ్లు మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. అప్పటికే ప్రపంచానికి విషయం తెలిసిపోవడంతో కామ్‌గా ఉండిపోయింది. చైనాలో వ్యాక్సినేషన్‌తో పాటు కఠిన నిబంధనలను అమలు చేస్తూ కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా మరో దేశంపై చైనా అభాండాలు వేసింది. బీజింగ్‌లో ఇటీవలే ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. దీంతో చైనా అప్రమత్తం అయింది. బీజింగ్‌కు వచ్చిన…
ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా దేశంలో 2,38,018 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. నిన్నటి కేసుల కంటే ఈరోజు 20,071 కేసలు తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,57,421 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 310 మంది కరోనాతో మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 17,36,628 పాజిటివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే, దేశంలో ఇప్పటి…