స్టార్ హీరోయిన్ కి ఒమిక్రాన్.. ఆందోళనలో ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కరోనా పట్టి పీడిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో స్టార్లు కరోనా బారిన పడుతుండడం అభిమానవులకు భయాందోళనలను కలిగిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా పలు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ స్టార్ హీరోయిన్ శోభన ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు.
” లోకమంతా నిద్ర పోతున్న వేళ.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను ఒమిక్రాన్ బారిన పడ్డాను. నాకున్న లక్షణాలు ఏంటంటే.. కీళ్లనొప్పులు, చలి, కొద్దిగా గొంతు నొప్పి.. ఇవన్నీ మొదటి రోజు ఉన్నాయి. ప్రస్తుతం కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పటికే రెండు టీకాలు తీసుకోవడం వలన ఒమిక్రాన్ ముప్పు నుంచి 85శాతం కోలుకుంటామని నమ్ముతున్నాను. దయచేసి అందరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న శోభన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన శోభన ప్రస్తుతం పలు సినిమాల్లో తల్లి పాత్రల్లో నటిస్తుంది. మరో పక్క డ్యాన్స్ స్కూల్ నడుపుతూ అందరికి భారతీయ నృత్యాన్ని నేర్పిస్తుంది.
Also Read
- 4 Years of Vikram: లోకనాయకుడి 'విక్రమ్' కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
- Ntv Exclusive: 'పెద్ది'తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
- PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
- Crime Thriller OTT : ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
4 Years of Vikram: లోకనాయకుడి ‘విక్రమ్’ కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
-
Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
-
Team India Series: భారీ సిరీస్‌కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్‌కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!