తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. అయితే తెలంగాణ లో కోవిడ్ ఆంక్షలు జనవరి 31 నాటికి ముగిశాయి. కానీ కోవిడ్ ఆంక్షల గడువు పెంచలేదు ప్రభుత్వం. మళ్ళీ ఆంక్షలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేదు సర్కార్. బహిరంగ సభలు, ర్యాలీల పై నిషేధిస్తూ రాజకీయ, మత, సాంస్కృతిక పరమైన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ జనవరి ఒకటి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో, మాల్స్, షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో మాస్క్ ను తప్పని…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,35,532 కరోనా కేసులు నమోదవ్వగా, 871 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా కేసులు తగ్గుతుంటే, మరణాలు పెరుగుతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. కరోనా కొత్త కేసుల కంటే రికవరీ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 3,35,939 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 20,04,333 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రోజుకవారీ కరోనా పాజిటివిటీ రేటు…
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ టెన్షన్ పెడుతూనే ఉంది.. ఇక, భారత్‌లో ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది.. వందలు, వేలు.. లక్షలు దాటేస్తున్నాయి.. రోజువారి కేసులు.. ఈ సమయంలో.. ఊరట కలిగించే అంశాన్ని తెలిపింది ఐసీఎంఆర్ నిర్వహించిన తాజా అధ్యయనం.. ఒమిక్రాన్ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తేల్చారు.. ఇది డెల్టాతో పాటు ఇతర కోవిడ్ వేరియెంట్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగలదని ప్రకటించింది. Read Also: ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్…
కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది.. కొత్త కొత్త వేరియంట్లుగా విరుచుకుపడుతూనే ఉంది.. ప్రస్తుతం కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తూ.. భయాందోళనకు గురిచేస్తోంది.. రికార్డుల స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.. అయితే, ఒమిక్రాన్‌పై తాజాగా జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది.. ఒమిక్రాన్ జెట్ స్పీడ్‌తో వ్యాప్తి చెందడానికి కారణం ఏంటి? మనిషి శరీరంపై అది ఎంత సేపు సజీవంగా ఉంటుంది..? ఇతర వస్తువులపై ఎన్ని గంటల పాటు…
కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న రక్షణ కావడంతో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు అందించాలని నిర్ణయించారు. చాలా దేశాల్లో 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసుల అందిస్తున్నారు. బూస్టర్ డోసులు తీసుకున్నవారిలో యాంటిబాడీలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు టెక్సాస్ యూనివర్శిటి వైద్య విభాగం కీలక పరిశోధన చేసింది. ఫైజర్ టీకాను తీసుకున్నవారి…
ఒకవైపు కరోనా… మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం విద్యార్ధులకు ఊరట కలిగించనుంది. సిలబస్ తగ్గించడంతో పాటు ఛాయిస్ ప్రశ్నలు కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు. ఎల్లుండి నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభం అవుతాయి. విద్యార్ధులపై వత్తిడి తగ్గించాలని నిర్ణయించింది. టెన్త్ ఇంటర్ పరీక్షలు కూడా ఆలస్యం కానున్నాయి. మార్చి, ఏప్రిల్ లో జరగాల్సిన పరీక్షలు మే నెలలో జరుగుతాయని తెలుస్తోంది. గత ఏడాది నిర్వహించినట్టుగానే 70…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపచ దేశాలను చుట్టేస్తూనే ఉంది.. కొన్ని దేశాలపై విరుచుకుపడుతోంది.. మరికొన్ని దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది.. దాని దెబ్బకు థర్డ్ వేవ్.. కొన్ని ప్రాంతాల్తో ఫోర్త్ వేవ్ కూడా వచ్చేసింది.. దీంతో ఆంక్షల బాట పడుతున్నాయి అన్ని దేశాలు.. మరోవైపు.. కరోనా ఫస్ట్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచం దృష్టిని ఆకర్షించిన న్యూజిలాండ్.. ఒమైక్రాన్ మాత్రం ఇంకా ఎంటర్ కానీలేదు.. అయితే, ఒక వేళ ఒమిక్రాన్ వచ్చినా లాక్‌డౌన్‌కు వెళ్లేది లేదంటున్నారు…
దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. థర్డ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,17,532 కరోనా కేసులు నమోదవ్వగా, గడిచిన 24 గంటల్లో 491 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 2,23,990 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే, దేశంలో ప్రస్తుతం 19,24,051 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 16.41శాతంగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం…