ఒకవైపు కరోనా… మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం విద్యార్ధులకు ఊరట కలిగించనుంది. సిలబస్ తగ్గించడంతో పాటు ఛాయిస్ ప్రశ్నలు కూడా ఎక్కువగా ఇవ్వనున్నారు. ఎల్లుండి నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభం అవుతాయి. విద్యార్ధులపై వత్తిడి తగ్గించాలని నిర్ణయించింది. టెన్త్ ఇంటర్ పరీక్షలు కూడా ఆలస్యం కానున్నాయి.
మార్చి, ఏప్రిల్ లో జరగాల్సిన పరీక్షలు మే నెలలో జరుగుతాయని తెలుస్తోంది. గత ఏడాది నిర్వహించినట్టుగానే 70 శాతం సిలబస్ వుంటుంది. సగానికి ఎక్కువగా ఛాయిస్ వుంటుంది. 60 మార్కుల పేపర్లో 110 మార్కుల ప్రశ్నలు, వంద మార్కుల పేపర్లో 210 మార్కుల ప్రశ్నలు వుంటాయని తెలుస్తోంది. కోవిడ్ కారణంగా విద్యార్ధులు నాణ్యమయిన విద్యను అభ్యసించలేదని ప్రభుత్వం భావించింది