ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,35,532 కరోనా కేసులు నమోదవ్వగా, 871 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా కేసులు తగ్గుతుంటే, మరణాలు పెరుగుతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. కరోనా కొత్త కేసుల కంటే రికవరీ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 3,35,939 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 20,04,333 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రోజుకవారీ కరోనా పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు 165,04,87,260 వ్యాక్సిన్ డోసులు అందించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపించింది. వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉండటంతో పాటు, కోలుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నది. అయితే, తీవ్రత తక్కువగా ఉందని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read: చంద్రునిపై చెక్కర్లు కొట్టేందుకు టయోటా వెహికిల్ రెడీ…