చాలామందికి చూయింగ్ గమ్ తినే అలవాటు వుంటుంది. యూత్‌లో ఇది మరీ ఎక్కువ. దీంతో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పరిశోధకులు ఆశాజనక ఫలితాలు సాధించారు. ఇటీవల ప్రచురితం అయిన అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడిచేస్తున్నాయి. కరోనా సోకినా వ్యక్తుల లాలాజలంలో అధిక స్థాయిలో వైరస్ ఉంటుందని అధ్యయనాల ఆధారాలు చెబుతున్నాయి. అందువల్ల యూఎస్ పరిశోధకులు ప్రత్యేకంగా ఒక చూయింగ్ గమ్ రూపొందించారు. దీని సహాయంతో నోటిలోని వైరస్ మొత్తాన్ని…
ఒమిక్రాన్ టెన్షన్ ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. డెల్టా నుంచి బయటపడేలోగా ఒమిక్రాన్ వేరియంట్ ఇబ్బందులు పెడుతుండటంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. డెల్టా వేరియంట్‌లో 8 రకాల మ్యూటేషన్లు ఉంటే, ఒమిక్రాన్‌లో 30 రకాల మ్యూటేషన్లు ఉన్నాయి. అంతేకాదు, డెల్టా వేరియంట్ వ్యాప్తి రేటు 1.47 ఉంటే, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి రేటు 1.97గా ఉంది. ఇదే ఇప్పుడు అందర్ని భయపెడుతున్నది. డెల్టా విజృంభించిన సమయంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పాల్సిన అవసరం లేదు. …
దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఒకవైపు ఒమిక్రాన్ వేరయింట్ కేసులు పెరుగుతుంటే, మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాలయాల్లో విద్యార్థులకు కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 72 గంటల్లో తెలంగాణ, కర్ణాటకలోని విద్యాసంస్థల్లో వంద మందికి కరోనా సోకింది. కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 43 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రితం కళాశాలలో జరిగిన వేడుకల తరువాత కేసులు బయటపడ్డాయి. దీంతో…
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలో థర్డ్ వేవ్‌కి దారితీస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే పదిహేడు కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. టాంజానియా నుంచి వచ్చిన రాంచీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తి కొత్త మహమ్మారి బారిపడ్డాడు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ అతనికి ఒమైక్రాన్ సోకింది. ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో చికిత్స పొందుతున్నాడు. జైపూర్‌లో తొమ్మిది ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.…
ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిమ్రాన్ ఇప్పటికే 46 దేశాలను చుట్టేసింది.. అందులో భారత్ కూడా ఉంది.. మన దేశంలో 20కు పైగా ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.. మరోవైపు.. విదేశాల నుంచి ముఖ్యంగా ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. టెస్టులను తప్పనిసరి చేసింది.. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 1వ తేదీన బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అంతా టెన్షన్…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది.. సౌతాఫ్రికా వెలుగుచూసిన ఈ వైరస్ క్రమంగా ప్రంపచదేశాలను పాకిపోతోంది.. ఇక భారత్‌లోనూ ఈ వేరింట్ కేసులు బయటపడ్డాయి.. ఇప్పటికే 20కి పైగా కేసులు నమోదయ్యాయి.. అయితే, తెలంగాణలో ఈ వేరింయట్ కేసులు ఇంకా వెలుగుచూడలేదు.. విదేశాల నుంచి వచ్చినవారి ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది.. కోవిడ్ పాజిటివ్‌గా తేలినా.. ఒమిక్రాన్‌గా నమోదైన కేసులు ఇప్పటి వరకు జీరోగానే ఉన్నాయి. కానీ, తెలంగాణకు కూడా ఆ మహమ్మారి…
కరోనా వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న గందరోగోళం అంతాఇంతా కాదు. కొత్త కొత్త వేరియంట్‌లతో కరోనా రూపాలు మార్చుకొని ప్రజలపై దాడి చేస్తోంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో బయటపడ్డ మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం ఇప్పటికే పలు దేశాలపై దండయాత్రను మొదలు పెట్టింది. అంతేకాకుండా ఇటీవలే ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు థర్డ్ వేవ్ తప్పదని కాన్పూర్ ఐఐటీ ఫ్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కరోనా…
న్యూయార్క్‌ను ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. సెకండ్ వేవ్ సమయంలో న్యూయార్క్ నగరం ఎంతలా అతలాకుతలమైందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్న తరుణంలో మరోసారి ఆ నగరాన్ని కరోనా భయపెడుతున్నది. డెల్టా కంటే 6 రెట్లు ప్రమాదకరమైన ఒమిక్రాన్ న్యూయార్క్ నగరంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు న్యూయార్క్‌లో 8 కేసులు నమోదయ్యాయి. Read: వీడని ఒమిక్రాన్ భయం… ఆ గుట్టు బయటపడేదెప్పుడు… నగరంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని న్యూయార్క్…
ప్రపంచం గత రెండేళ్ళుగా కరోనా మహమ్మారి కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లక్షలాదిమంది బలయ్యారు. ప్రతి దేశం ఈ కోవిడ్ బారిన పడింది. కరోనా ఇక తగ్గుముఖం పట్టిందిలే అని భావిస్తున్న తరుణంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ ప్రభావం కనిపిస్తోంది. మూడుకేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ మళ్లీ తన సత్తా చాటుతుందని భావిస్తున్న వేళ పలు దేశాలు కఠిన ఆంక్షలవైపు మళ్లుతున్నాయి. ఈసారి సరికొత్త రూపంలో లాక్డౌన్లకు సిద్ధమయ్యాయి. కరోనా నుంచి రక్షణగా భావిస్తున్న టీకా…