న్యూయార్క్‌ను ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. సెకండ్ వేవ్ సమయంలో న్యూయార్క్ నగరం ఎంతలా అతలాకుతలమైందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్న తరుణంలో మరోసారి ఆ నగరాన్ని కరోనా భయపెడుతున్నది. డెల్టా కంటే 6 రెట్లు ప్రమాదకరమైన ఒమిక్రాన్ న్యూయార్క్ నగరంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు న్యూయార్క్‌లో 8 కేసులు నమోదయ్యాయి.
Read: వీడని ఒమిక్రాన్ భయం… ఆ గుట్టు బయటపడేదెప్పుడు…
నగరంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని న్యూయార్క్ నగర హెల్త్ కమీషనర్ మేరీ బాసెట్ పేర్కొన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తప్పని సరిగా మాస్కులు ధరించాలని, అధికారులు ఆదేశాలు జారీ చేశారు. న్యూయార్క్ తో పాటుగా ఒమిక్రాన్ కేసులు మసాచ్యుసెట్స్, వాషింగ్టన్ రాష్ట్రాలలో కూడా నమోదవ్వడంతో ఆందోళన మొదలైంది.