ప్రపంచదేశాలను ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి వణికిస్తోంది.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది… ఇదే సమయంలో.. ఒమిక్రాన్ అంత సీరియస్ కాదనే వాదనలు కూడా ఉన్నాయి.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే జెట్ స్పీడ్‌తో విస్తరిస్తున్నా.. ప్రాణాలకు ముప్పులేదని.. డెత్ రేట్ తక్కువని చెబుతున్నారు.. కానీ, ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.. ఇప్పటికే ఫస్ట్ వేవ్ చూశాం.. కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టించిన విలయాన్ని ఇంకా మర్చిపోలేదు.. ఇప్పుడు…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జట్ స్పీడ్‌తో ప్రపంచాన్ని చుట్టేసేపనిలో పడిపోయింది.. ఇప్పటికే 57 దేశాలకు పాకేసిన ఒమిక్రాన్ కేసులు కొన్ని దేశాల్లో పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి.. బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ విలయమే సృష్టిస్తోంది.. ఒకే రోజు 101 కొత్త కేసులు నమోదయ్యాయి.. దీంతో.. అక్కడి ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్ ఆరోగ్య అధికారులు వెల్లడించారు.. డెల్టా వేరియంట్ కంటే కొత్త వేరియంట్…
కరోనా రక్కసి కోరల్లో చిక్కుకొని ఫ్రాన్స్ విలవిలలాడుతోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్నా కరోనా విజృంభనమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా ఆదేశాన్ని కలవరడపెడుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రులు పూర్తి స్థాయిలో వినియోగించినా సరిపోవని ఫ్రాన్స్ వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో విధించే ‘కోడ్ వైట్’ అలర్ట్‌ను…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. గత రెండు కరోనా వేవ్‌లతోనే ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మరోసారి కరోనా రక్కసి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలకు పాకిన ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ఎంటరైంది. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు భారత్‌లో పెరుగుతున్నాయి. అంతేకాకుండా మునిపటికంటే ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య…
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది… ఇప్పటికే భారత్‌లో ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోవడమే కాదు.. ఆర్థికంగా కూడా అన్ని రంగాలను దెబ్బ కొట్టింది ఈ మహమ్మారి.. మరోవైపు… సౌతాఫ్రికాలో తాజాగా వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అన్ని దేశాలను టెన్షన్ పెడుతోంది.. డెల్టా వేరియెంట్ తగ్గుముఖం పట్టిందని సంతోషించే లోపే.. ఒమిక్రాన్ రూపంలో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది..…
ఒమిక్రాన్ వేరియంట్‌పై, ప్రస్తుత కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చిన 13 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను, వ్యాక్సినేషన్‌ను అధికారులు మంత్రి హరీష్‌రావుకు వివరించారు. Read: పెళ్లి మండపంలోకి దూరి పెళ్లికూతురి…
ఒకవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ తెలంగాణ వాసుల్ని భయపెడుతోంది. దీనికి తోడు కరోనా మూడో దశ ముంచుకువస్తుందన్న హెచ్చరిక నేపథ్యంలో వరంగల్ వైద్యవర్గాలు అప్రమత్తం అవుతున్నాయి. మూడో దశ తీవ్రత ఎలా ఉంటుందనే విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినా ముందస్తు చర్యల పైన అధికారులు దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణలో అయిదు ఉమ్మడి జిల్లాలకు ఏకైక పేదల పెద్ద ఆస్పత్రి అయిన వరంగల్ ఎంజీఎంలో మరో మారు 250 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.…
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 21 కేసులు నమోదవ్వగా తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. ముంబైలో కొత్తగా రెండు కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి చేరింది. మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసుల సంఖ్య 10 కి చేరింది. ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని రాష్ట్రాలు…