ఒమిక్రాన్ భయం ప్రపంచాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నది. ఒమిక్రాన్ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాలను హెచ్చరించడంతో అప్రమత్తమయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ వేరియంట్ గురించిన పూర్తి సమాచారం రావడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. కోవిడ్ వైరస్ సార్స్ కోవ్ 2 జన్యు క్రమంలోని అన్ని భాగాల్లో ఉత్పరివర్తనాలు జరగడం వలన ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకు వచ్చింది.
Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఈ రూల్స్ పాటించాల్సిందే !
అంతేకాకుండా ఈ కొత్త వేరియంట్ సౌతాఫ్రికాలో ఎక్కువగా వ్యాప్తి చెందటంతో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశారు. కొత్త వేరియంట్‌లోని కొన్ని ఉత్పరివర్తనాలు పాత వేరింయట్లలో కూడా ఉండటంతో ఆందోళనల మొదలైంది. ఊహాన్‌లో తొలి కోవిడ్ వైరస్‌లో ఉన్న ఉత్పరివర్తనాలతో పొలిస్తే డెల్టాలో 10, ఒమిక్రాన్ వేరియంట్‌లో 30 వరకు ఉత్పరివర్తనాలు ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌లోని ఉత్పరివర్తనాలు పరస్పరం ఎలా చర్యలు జరుపుతాయనేది కీలకం. దీనిపైనే ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. దీని గురించిన పూర్తి వివరాలు తెలియడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.