కరోనా రక్కసి కోరల్లో చిక్కుకొని ఫ్రాన్స్ విలవిలలాడుతోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్నా కరోనా విజృంభనమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా ఆదేశాన్ని కలవరడపెడుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రులు పూర్తి స్థాయిలో వినియోగించినా సరిపోవని ఫ్రాన్స్ వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో విధించే ‘కోడ్ వైట్’ అలర్ట్‌ను ఆరోగ్య సంస్థ దక్షిణ ఫ్రాన్స్‌లోని అన్ని ఆసుపత్రులకు జారీ చేసింది.
ఫ్రాన్స్ యొక్క “కోడ్ వైట్” చర్యలు పునరుజ్జీవన పడకల సంఖ్యను పెంచడం, తక్కువ రద్దీ ఉన్న ఆసుపత్రులకు రోగులను బదిలీ చేయడం, కమ్యూనికేషన్ ప్రక్రియలను బలోపేతం చేయడం, సంక్షోభ యూనిట్‌ను ఇన్స్టాల్ చేయడం, బ్యాకప్ సిబ్బందిని సమీకరించడం, మరియు కరోనావైరస్ రోగులకు ఆపరేషన్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి సంస్థగత చర్యలు కోడ్ వైట్ అలర్ట్‌లోకి వస్తాయి. అయితే కోవిడ్-19 మహమ్మారి 2020 మార్చిలో విజృంభించిని నేపథ్యంలో కోడ్ వైట్ అలర్ట్‌ను ఉపయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.