ప్రపంచదేశాలను ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి వణికిస్తోంది.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది… ఇదే సమయంలో.. ఒమిక్రాన్ అంత సీరియస్ కాదనే వాదనలు కూడా ఉన్నాయి.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే జెట్ స్పీడ్‌తో విస్తరిస్తున్నా.. ప్రాణాలకు ముప్పులేదని.. డెత్ రేట్ తక్కువని చెబుతున్నారు.. కానీ, ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.. ఇప్పటికే ఫస్ట్ వేవ్ చూశాం.. కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టించిన విలయాన్ని ఇంకా మర్చిపోలేదు.. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ పొంచిఉందని.. తేలిగ్గా తీసుకుంటే ఉపద్రవం తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు, పరిశోధకులు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఒకటైతే.. ఆ తర్వాత క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి ఇలా వరుసగా ప్రజలు గుమ్మిగూడే సెలబ్రేషన్స్ వస్తున్నాయి.. ఈ తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమని వార్నింగ్ ఇస్తున్నారు.
Read Also: బ్రిటన్‌లో ఒమిక్రాన్ విలయం..!
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌పై పలు పరిశోధనలు సాగుతున్నాయి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా ‘వేరియెంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించిన వాటిలో ఒమిక్రాన్ ఐదోది. ఒమిక్రాన్ వేరియంట్ మానవ రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోవడంతోపాటు ఎక్కువ మందికి సోకడం, నెమ్మదిగా తీవ్రస్థాయికి చేరుకోవడం ద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.. ఇక, డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందడం.. రోగా నిరోధకశక్తి, టీకాలతో వచ్చిన శక్తిని కూడా తప్పించుకోగలిగే సామర్థ్యం దీని సొంతం అంటున్నారు.. గతంలో కోవిడ్ బారిన పడ్డవారికి రీఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని.. బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లు, మోనోక్లోనల్ యాంటీ బాడీస్‌తో పాటు వేరే చికిత్సలకు తగ్గే అవకాశాలు కూడా తక్కువని.. ఒక్క డోసు కూడా తీసుకోని వారిలో కరోనా ముదిరే ప్రమాదం ఆందోళనకరంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
Read Also: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. పేరుకుపోయిన కోవిడ్ టీకాలు..!
ఇదే సమయంలో.. ఒమిక్రాన్ ఎక్కువ మందికి సోకుతుంది తప్పితే ప్రమాదకారి కాదంటూ అజాగ్రత్తగా ఉండటం ఏమాత్రం మంచిదికాదంటున్నారు. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్‌పై స్పందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. ఒమిక్రాన్ కారణంగా భారత్‌లో భారీ ఎత్తున థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుంది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీ పెరిగే అవకాశం లేకపోలేదని పేర్కొంది.. ఈ తరుణంలో 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని.. వ్యాక్సిన్‌తో కరోనా ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చు అని పేర్కొంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్.