Fire accident: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు నగరవాసులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. నిన్న అర్థరాత్రి హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. హుస్సేనియాలం పోలీస్టేషన్ పరిధిలోని ఎయిర్‌కూలర్ షాప్, ఆటో విడిభాగాలోని 2 షాపుల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున పొగలు అలుముకోవడంతో ఇద్దరు చిక్కుకున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు కూడా మంటలను అదుపు చేసేందుకు సహకరించారు. స్థానికులు ఇళ్ల నుంచి నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్థానిక సమాచారంతో సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఇద్దరిని కాపాడి సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. రాత్రంతా శ్రమించి మంటలను అదుపుచేశారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. ఆస్తి నష్టం ఎంత జరిగిందనే దానిపై అధికారులు ఆరాధిస్తున్నారు.
Read also: Astrology: మే 20, ఆదివారం దినఫలాలు
తాజాగా హైదరాబాద్‌లోని ఓల్డ్ బస్తీ మీర్ ఆలం పార్కులో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఘటన తెలిసిందే. ఫర్నీచర్ గోదాములో భారీగా మంటలు చెలరేగాయి. గోదాములో మంటలు వేగంగా వ్యాపించడంతో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి చుట్టుపక్కల భవనాలకు వ్యాపిస్తున్నాయి. పక్కనే ఉన్న రెండు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. దీంతో ఇళ్లలోని ప్రజలు ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పక్కనే ఉన్న ఇతర నివాస గృహాల నుంచి కూడా స్థానికులు పరుగులు తీస్తున్నారు. ఇళ్ల మధ్యలో అక్రమ గొండలు ఏర్పాటు చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశారు. పాతబస్తీలోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురువుతున్నారు. అధికారులు అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Astrology: మే 20, ఆదివారం దినఫలాలు