Fake Baba Case: నకిలీ బాబాకేసు భాగ్యనగరంలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈఘటన రాష్ట్రంలోనే హాట్ టాపిక్. ఎన్జీవో ఆపరేషన్ ఎంట్రీతో పాతబస్తీ చర్చనీయాంశంగా మారింది. నకిలీ బాబా మహిళలపై చేస్తున్న అరాచకాలకు తెరదించింది. అయితే పాతబస్తీ బాబా కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. పూజల పేరుతో యువతుల నగ్న ఫోటోల బాబా వీడియోలు తీశాడు. నగ్న ఫోటోలు వీడియోలను వ్యభిచారి ముఠాలకి పంపింస్తున్నాడనే వార్త పోలీసులకు షాక్ కు గురయ్యేలా చేసింది. పాతబస్తీ చెందిన మహిళా నగ్న వీడియో, ఫోటోలని వ్యభిచారం గృహాలకు బాబా పంపిచాడు. మహారాష్ట్రలోని వ్యభిచార ముఠాలకి అమ్మాయిల ఫోటోలు బాబా విక్రయించాడని అధికారులు గుర్తించారు. ఫోటోలను చూసి అమ్మాయిలకు, మహిళలకు ముఠా రేటును ఫిక్స్ చేస్తున్నారని తెలిపారు. పాతబస్తీ చెందిన ఎన్జీవో చేసిన ఆపరేషన్ లో బాబా లీలలు గుట్టురయ్యాయని అధికారులు తెలిపారు. ఫేక్ బాబా హుసేని చంద్రాయన గుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బాబా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆఫోన్‌లో వందల సంఖ్యలో మహిళల నగ్న ఫోటోలు వీడియోలు లభ్యమయ్యాయిని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎంతమంది మహిళలని ట్రాప్ చేశారా? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read also: Bandla Ganesh: నోటికి ఎదోస్తే అది అంటావా? బండ్లన్నపై అల్లు ఫాన్స్ ఫైర్
అయితే మహిళలు ఈ ఫేక్ బాబాను ఎలా నమ్మారు అనే ప్రశ్న అధికారులకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. ఫోటోలు తీస్తున్న అమ్మాయిలు, మహిళలు ఎలా సహకరించారని, ఎంత సమస్య వచ్చినా అసలు నగ్నంగా అతని ముందుకు ఎందు ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు. ఇంతగా ట్రిప్ చేస్తున్నా మహిళలు అతనికి సహకరించారా? లేక ఫేక్ బాబానే వారిని మత్తులో ఉంచి ఇలా ఘటనలకు పాల్పడుతున్నాడా? లేకా.. మహిళలను బ్లాక్ మైల్ చేసి ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మహిళలు ఇలాంటి బాబాలతో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. నగ్నఫోటోలు తీస్తున్నా అలాంటి అనుమానాలు వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఇలాంటి బాబాలను నమ్మవద్దనిని టెక్నాలజీ పెరుగుతున్న ఇంకా మూఢనమ్మకాలపై ఆధారపడం ఏంటిని, మీలాంటి వారి ఇబ్బందులను బాబాలు ఆసరాగా తీసుకుని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఇప్పటికైనా మహిళలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.