రాజాసింగ్ పై కేసు నమోదు చేసి, జైలుకు పంపాల్సిందే అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఇటీవలే రాజా సింగ్ విడుదల చేసిన విడియో రిలీజ్ చేయడం వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజా సింగ్ మహుమద్ ప్రవక్తపై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. దానీ ప్రభావంవల్లే ఇప్పుడు పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తాయని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉండేదని, ఇప్పుడు బీజేపీ వల్ల ప్రశాంతంగా ఉన్న నగరం అశాంతి నెలకొందని ఆరోపించారు. రాజా సింగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. రాజా సింగ్ భవిషత్ లో ఇలాంటి వాక్యలు చేయకుండా ఉండాలంటే అతని పై కేసు లు నమోదు చేసి జైల్ పంపాలని డిమాండ్ చేశారు. ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి రాజా సిగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి వాఖ్యలు చేయకుండా ఉండాలంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ స్పందించి రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు.
అయితే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వీడియోలో ఏ మతాన్ని కించపరచలేదని స్పష్టం చేశారు. కాగా.. కోర్టు పరిమితుల దృష్ట్యా ఎక్కువగా మాట్లాడలేదని.. మిగతా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కుంటానని స్పష్టం చేశారు. తను వీలైనంత త్వరగా షోకాజ్ నోటీసులపై సమాధానం ఇస్తానని తెలిపారు.. తన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపార్టీ తనను వదులుకోదని అనుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తనకు పూర్తి నమ్మకముందని అన్నారు.
Telangana Public Sevice Commission: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాటలో యూపీఎస్సీ. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కి శ్రీకారం