Bike Racers: పాతబస్తీలో బైక్ రేసర్లు వీరంగం.. యువకుడిపై కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike Racers: పాతబస్తీలో బైక్ రేసర్లు రోడ్డుపై వీరంగం సృష్టించారు. బైక్ రేసింగ్ చేస్తున్న పోకిరీలను అడ్డుకున్న యువకుడిపై దారుణానికి పాల్పడ్డాడు. బైక్ రేసర్లంతా ఏకమై యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన పాత బస్తీలోని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో షెజికి మజీద్ వద్ద కొందరు వ్యక్తులు బైక్ రేసింగ్ చేస్తుండగా స్థానిక యువకుడు రేసర్లను అడ్డుకున్నాడు. రోడ్లపై బైక్ రేసింగ్ ఏమిటి? అంటూ.. ఇక్కడ బైక్ రేసింగ్ చేయొద్దని హెచ్చరించారు. బైక్ రేసింగ్‌ల వల్ల వాహనదారులతో పాటు స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేయవద్దని పోకిరీలకు సూచించారు. అవసరమైతే ఖాళీ ప్రదేశాల్లో వెళ్లి బైక్ రేసింగ్ చేయాని, ఇలా పబ్లిక్ గా రోడ్లపై బైక్‌రేసింగ్ ఎలా చేస్తారు? అని రేసర్లను అడిగాడు. దీంతో బైక్ రేసర్లకు, యువకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడిపై పోకిరీలు విరుచుకుపడ్డారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
Read also: Minister KTR: నేడు భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటన.. 6 ప్రారంభోత్సవాలు, 2 శంకుస్థాపనలు
వారంతా యువకుడిపై కత్తులతో దాడి చేసి రణరంగం సృష్టించారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రోడ్లపై బైక్ స్టంట్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
జాతీయ రహదారులపై వాహనాల అతివేగానికి అడ్డుకట్ట వేసి స్పీడ్ గన్ లు ఏర్పాటు చేసి ఏటా కోట్లాది రూపాయల జరిమానాలు వసూలు చేస్తున్న పోలీసులు వాహనాలు నడిపే కొందరు పోకిరీలపై చర్యలు తీసుకోవడం లేదని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో కొందరు విద్యార్థులు, యువకులు పోటీపడి రోడ్లపై విన్యాసాలు చేస్తూ పాదచారులు, ఇతర వాహనాలు భయాందోళనకు గురిచేస్తున్నారని పలువురు తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు నగర శివారులో చోటుచేసుకుని కొందరు విద్యార్థులు, యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. రోడ్డుపై వేగంగా వెళుతుండగా సడన్ బ్రేక్ వేస్తే పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంబడి, బస్టాండ్‌ల చుట్టూ పోకిరీలు తమ ప్రతాపం చూపుతున్నారు. పోకిరీల బైక్ స్టంట్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Maternal Mortality: ప్రతీ రెండు నిమిషాలకు ఓ తల్లి మరణిస్తోంది.. యూఎన్ రిపోర్ట్..
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!