కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఏమైంది..? పదవిపై ఎందుకు జాప్యం జరుగుతోంది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయన ఎమ్మెల్సీ అయ్యారా.. లేదా? టీఆర్‌ఎస్‌తోపాటు రాజకీయావర్గాల్లో ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నా.. ఇంత వరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ఆ ఫైల్ ఆగిందా లేక ఆపారా అన్న చర్చ జోరందుకుంది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్!
Also Read
ఆగస్టు ఒకటో తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కొద్దిరోజుల ముందే టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీ వర్గాలైతే విస్మయం చెందాయి. ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో కౌశిక్‌రెడ్డి పేరును సిఫారసు చేసింది ప్రభుత్వం. అయితే పార్టీ నేతగా కాకుండా.. ఒక క్రికెట్ ప్లేయర్‌గా అతని పేరును మంత్రివర్గ సమావేశంలో ఎంపిక చేశారు.
పదిరోజులైనా విడుదల కాని గెజిట్!
కేబినెట్ ఎమ్మెల్సీగా సిఫారసు చేసింది సరే. ఇంతకీ కౌశిక్‌రెడ్డికి సంబంధించిన ఫైల్ ఎక్కడుంది? ఏమైంది? ఏ పొజిషన్‌లో ఉంది? ఇలా పదిరోజులుగా ఆరా తీస్తున్నారు. సంబంధిత విభాగాలను అడిగితే ఎవరూ తమకు తెలియదు అనే సమాధానం ఇస్తున్నారట. గతంలో బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, దయానంద్‌లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినప్పుడు ఇంత టైమ్ పట్టలేదు. కానీ.. కౌశిక్‌రెడ్డి విషయంలోనే అనేక ప్రశ్నలకు తావిస్తోందట.
రాజ్‌భవన్‌లో ఆగిందా? సీఎంవోలో పెండింగ్‌లో ఉందా?
ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన ఫైల్ రాజ్‌భవన్‌లో ఆగిపోయిందా? లేక CMOలో పెండింగ్‌లో ఉందా? సెక్రటేరియట్‌కు వచ్చి ఆగిపోయిందా అన్నది ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారట. పైగా ఈ అంశంపై చర్చించేందుకు అధికారులు జంకుతుండటం మరింత సందేహాలకు ఆస్కారం ఇస్తోంది. గవర్నర్ కూడా అందుబాటులో ఉన్నారు. అయినప్పటికీ ఎందుకు తాత్సారం జరుగుతోందో పార్టీ వర్గాలకు కూడా తెలియడం లేదట. ఈ సందర్భంగా రకరకాల ఊహాగానాలు.. చర్చలు బయటకొస్తున్నాయి.
ఫైల్ ఎక్కడైనా ఆగిందా? ఎవరైనా ఆపారా?
కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న నిర్ణయంపై టీఆర్‌ఎస్‌లో ఇంటా బయటా విమర్శలు వచ్చాయి. హుజురాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్ నేతలు సైతం ప్రత్యేకంగా ఓ నాయకుడి ఇంట్లో మీటింగ్ పెట్టుకుని అభ్యంతరాలు వ్యక్తం చేశారట. కౌశిక్‌రెడ్డి పాల్గొనే కార్యక్రమాలకు వెళ్లకూడదని ప్రత్యేకంగా తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. పైగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చేసిన కార్యక్రమాలపై వ్యతిరేక ప్రచారం కూడా మొదలైంది. దీంతో ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన ఫైల్ ఎక్కడైనా ఆగిందా? లేక ఎవరైనా ఆపారా అన్న చర్చకు ఈ కథనాలను జోడించి చర్చకు పెడుతున్నారు. మరి.. ఆ ఫైల్ ఏమైందో ఏంటో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!