Srikanth Odela: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు విశ్వరూపం ఆ రోజు తెలుస్తుంది: శ్రీకాంత్ ఓదేల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikanth Odela: న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో ‘దసరా’ వంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ప్రస్తుతం ఈ హిట్ డైరెక్టర్ డైరెక్షన్‌లో నాని చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “ది ప్యారడైజ్” (The Paradise). పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం 34వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, ఈ పాత్రపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
READ ALSO: Mamata Banerjee: ఎలక్షన్ షెడ్యూల్ ముందు.. హిందూ, ముస్లిం ఓట్ల కోసం మమతా కీలక నిర్ణయం..
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
మనం మిస్సవుతున్న ‘మోహన్ బాబు’ను చూపిస్తా..
ఈ వేడుకలో శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. “నటుడిగా మోహన్ బాబు గారి అసలైన సామర్థ్యం గురించి ఇప్పటి తరం ప్రేక్షకులకు పూర్తి అవగాహన లేదు. మనం ఎప్పటి నుంచో మిస్ అవుతున్న ఆ విలక్షణ నటుడిని, ఆయనలోని అసలైన విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా వెండితెరపై ఆవిష్కరించబోతున్నాను. దీని గురించి నేను ఇప్పుడు ఎక్కువగా చెప్పను, టీజర్, ట్రైలర్ల రిలీజ్ అయ్యాకా మీకే అర్థమవుతుంది” అంటూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశారు. ఈ చిత్రంలో మోహన్ బాబు ‘షికంజా మాలిక్’ అనే భయంకరమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాలోని గాంభీర్యాన్ని, వైలెన్స్‌ను ప్రతిబింబిస్తోంది.
ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ నటిస్తుండగా, సోనాలి కుల్కర్ణి, రాఘవ్ జుయల్, తనికెళ్ల భరణి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 2026, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నాని – మోహన్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!