Telugu News

WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Agnipath Protests
  • Congress Satyagraha Deeksha
  • Covid 19
  • IND vs SA
  • President Election
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Off The Record Special Story On Ycp Mla Chevireddy Bhaskar Reddy

కేడర్‌ను ఆశ్చర్యపరుస్తోన్న చెవిరెడ్డిలో వచ్చిన మార్పు

Updated On - 09:23 PM, Thu - 12 August 21
By Varanasi Lakshminarayana
కేడర్‌ను ఆశ్చర్యపరుస్తోన్న చెవిరెడ్డిలో వచ్చిన మార్పు

ఆయన విపక్షంలో ఉన్నప్పుడు మాటలు తూటాల్లా పేలేవి. ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నారు. ఉలుకు లేదు.. పలుకు లేదు. అంతా బీ.. కామ్‌. అనుచరులకు కూడా తమ నేతలో వచ్చిన మార్పు అర్థం కావడంలేదట. ఆయనకేమైంది? ఎవరా నాయకుడు? ఏమా కథ?

కీలక అంశాలపై పెదవి విప్పని చెవిరెడ్డి!

వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోందట. విపక్షపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ప్రతి అంశంలోనూ దూకుడు ప్రదర్శించిన ఆ చెవిరెడ్డి.. ఈ చెవిరెడ్డి ఒకరేనా అనే పరిస్థితి అనుచరుల్లో ఉందట. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే మాత్రమే కాదు.. తుడా ఛైర్మన్‌, ప్రభుత్వ విప్‌. గడిచిన రెండున్నరేళ్లుగా చెవిరెడ్డి చర్చల్లోకి వచ్చిన సందర్భాలూ అరుదుగానే ఉన్నాయి. ఇటీవల ఆనందయ్య కరోనా మందు పంపిణీ ద్వారా ప్రచారంలోకి వచ్చారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, పులిచింతల గేటు కొట్టుకుపోవడం.. అమరరాజా ఫ్యాక్టరీ వివాదాల్లో చెవిరెడ్డి నుంచి నో రియాక్షన్‌. దీంతో తమ నేతకు ఏమైంది? ఎందుకు మాట్లాడటం లేదని ఆరా తీస్తున్నారట అభిమానులు.

అమరరాజా వివాదంలో చెవిరెడ్డి సైలెంట్‌!

రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా.. జిల్లా నుంచి మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యే రోజా వాయిస్‌ మాత్రమే వినిపిస్తోంది. మిగతా అంశాలు పక్కన పెడితే అమరరాజా ఫ్యాక్టరీ విషయంలో చెవిరెడ్డి వైఖరి ఏంటన్నది ఆసక్తిగా మారింది. కానీ.. ఆయన పెదవి దాటి ఒక్క మాట రాలేదు. అమరరాజా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నవారిలో ఎక్కువమంది చంద్రగిరి నియోజకవర్గానికి చెందినవారే. అయినప్పటికీ ఎక్కడా చిన్నమాట కూడా జారకుండా జాగ్రత్త పడుతున్నారట ఎమ్మెల్యే. ఆయన అనుచరులు మాత్రం.. కార్మికుల దగ్గరకు వెళ్లి.. అన్న చూసుకుంటాడులే అని ధైర్యం చెబుతున్నారట. ఇదే ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వంపై చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు మాటల దాడులు చేస్తున్నా.. చెవిరెడ్డి కిమ్మనడం లేదు.

అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి.. విపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు!

అమరరాజా రగడలో చెవిరెడ్డి సైలెంట్‌గా ఉండటం కేడర్‌ తట్టుకోలేకపోయిందట. డైరెక్టుగా ఆయన్నే అడిగేసినట్టు సమాచారం. అక్కడ కూడా కేడర్‌ చెప్పింది విన్నారే కానీ.. రిప్లయ్‌ ఇవ్వలేదట ఎమ్మెల్యే. అధికారంలో ఉన్నప్పుడు వివాదాలు.. ధర్నాలు, విమర్శలు చేస్తే.. నియోజకవర్గంలో అభివృద్ధిని ఎవరు పట్టించుకుంటారు అని సన్నిహితుల దగ్గర చెవిరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిపై .. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలపై ఫోకస్‌ పెట్టాలని తన మనసలో మాట బయటపెట్టారట చెవిరెడ్డి. పార్టీ అధినేత తనకు ఒకటికి మూడు నాలుగు పదవులు ఇచ్చింది పనిచేయడానికి కానీ.. గొడవలు చేయడానికి కాదని సూటిగా సుత్తిలేకుండా చెప్పినట్టు తెలుస్తోంది. అంతగా నోరు విప్పాల్సి వస్తే.. ఆ టైమ్‌ వచ్చినప్పుడు చూసుకుందామని బదులిచ్చారట ఎమ్మెల్యే.

కేడర్‌లో ఉన్న అనుమానాలకు చెవిరెడ్డి క్లారిటీ ఇచ్చారా?

సన్నిహితుల దగ్గర చెవిరెడ్డి వెల్లడించిన ఈ అంశాలు ఆ నోటా ఈ నోటా కేడర్‌కు, అనుచరులకు చేరాయి. దాంతో మా నాయకుడి స్టయిల్‌ మారిందే అని అనుకుంటున్నారట. పైగా కేడర్‌లో ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలకు ఒక్కమాటతో ఎమ్మెల్యే చెవిరెడ్డి చెక్‌ పెట్టారని టాక్‌ నడుస్తోంది. కొందరు అనుచరులు మాత్రం.. తమ నేత దూకుడును పక్కన పెట్టి కామ్‌గా ఉండటం నచ్చడం లేదట. మరి.. అలాంటి అనుచరుల కోసం చెవిరెడ్డి వైఖరి మార్చుకుంటారో లేక.. కొత్త తరహాలోనే ముందుకెళ్తారో చూడాలి.

  • Tags
  • Andhra Pradesh
  • chevireddy bhaskar reddy
  • off the record
  • YCP MLA Chevireddy Bhaskar Reddy
  • YSRCP

RELATED ARTICLES

APSRTC: ఫుల్‌ జోష్‌లో ఆర్టీసీ.. !

Anantha Babu: డ్రైవర్‌ హత్య కేసు.. ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో షాక్

CM YS Jagan: పట్టణాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష.. కీలక వ్యాఖ్యలు

Agnipath: అగ్నిపథ్‌పై కొంత అపోహ..! వాస్తవాలు గ్రహిస్తే సగౌరవంగా ఫీలవుతారు..!

Atmakur bypoll: ఈసీకి బీజేపీ ఫిర్యాదు.. మా అభ్యర్థికి, ఏజెంట్లకు భద్రత కావాలి..!

తాజావార్తలు

  • EX.MLC Ramulu Naik : గిరిజనుల భూములు లాక్కోవడమే కేసీఆర్‌ పని

  • NBK107 :బాలయ్య వెనక్కి తగ్గారా..!

  • Ravi Teja- Venkatesh : మరో భారీ మల్టీ స్టారర్..!

  • Anya’s tutorial :ఆ రెండే రాజమౌళికి ఇష్టం..!

  • Manchu Vishnu: ‘జిన్నా’ కి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions