దేవుడి సన్నిధిలో ఆరేళ్లపాటు ఆయనే సర్వాధికారి. ప్రభుత్వ పెద్దలతో స్నేహాలు.. రాజకీయ నాయకులతో పరిచయాలు.. చేతిలో అధికారం.. డోంట్ కేర్ అనే తత్వం. ఇంకే ముంది.. అంతా తానై చక్రం తిప్పారు. కాలం మారింది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఇంతకీ అంతా ఆయనే చేశారా? ఆయన వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఈ తవ్వకాలన్నీ ఆ అదృశ్య శక్తి కోసమేనా? సింహాచలం భూముల రగడలో ప్రభుత్వ యాక్షన్ ఏంటి? సింహాచలం భూముల వ్యవహారం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.…
నామినేటెడ్ పదవుల భర్తీలో అన్యాయం జరిగిందని వాపోతున్నారు కర్నూలు వైసీపీ సీనియర్లు. ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు ఇక తిరుగే ఉండదు అనుకున్న నేతలకు తాజా పదవుల పంపకాల్లో నిరాశే మిగిలింది. స్థానికంగా సీనియర్లు అనిపించుకున్న నేతలనూ హైకమాండ్ పక్కన పెట్టేయడం ఏ లెక్కలోనో అర్థంకాక తలపట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చినా పదవుల్లేవ్! కర్నూలు జిల్లాలో వైసీపీ సీనియర్లు.. నాయకులకు కొదవ లేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సాన్నిహిత్యం ఉండి.. వైసీపీ ఆవిర్భావం నుంచి జెండా…
హుజురాబాద్‌లో హత్యా రాజకీయాలు వర్కవుట్ అవుతాయా? ఉపఎన్నికను చావో రేవోగా భావిస్తూ.. తాజాగా చేసిన కామెంట్స్ ఈటలకు కలిసి వస్తాయా? ప్రత్యర్ధి పార్టీలు వేసే ఎత్తుగడలతో ఈటలకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? హుజురాబాద్‌లో మారుతున్న వ్యూహాలు ఉపఎన్నికల షెడ్యుల్ విడుదల కంటే ముందే హుజురాబాద్‌లో సందడి మొదలైంది. రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచుకుంటూ పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్ ఉపఎన్నికపైనే ఉంది. అక్కడ రాజకీయ పార్టీల నాయకులు చేసే ప్రకటనలు సర్వత్రా…
పార్లమెంట్ సమావేశాల మాటున ఢిల్లీలో ఆ ఎంపీ సొంత కార్యాలు చక్కబెట్టుకుంటున్నారా? ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అతను.. ఇప్పుడెందుకు పావులు కదుపుతున్నారు? మనసు మార్చుకున్నారా? మార్పు వెనక కథేంటి? ఎవరా ఎంపీ? ఈటల వ్యాపార భాగస్వామి కావడంతో భేటీకి ప్రాధాన్యం! ప్రధాని మోడీ మంత్రివర్గంలో ఇటీవల కేబినెట్ మినిస్టర్‌గా ప్రమోషన్ పొందిన కిషన్‌రెడ్డిని.. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కలిసి మాట్లాడారు. ఒకే రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్నందున కలిశారులే అని కొట్టి పారేయడానికి ఈ భేటీ లేదన్నది…
రెండేళ్లుగా గ్రూపు రాజకీయాలతో తలబొప్పి కొట్టిన ఆ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్ పట్టుకుందా? ఎంపీతో ఎడముఖం.. పెడముఖంగా ఉంటున్నారా? ఎంపీ వస్తున్నారని తెలిస్తే.. వేరే పని ఉందని చెప్పి ఎమ్మెల్యే వెళ్లిపోతున్నారా? ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలకు ఏ విషయంలో బెడిసికొట్టింది. ఎవరు వారు? కేడర్‌తో ఎమ్మెల్యే కిరణ్‌కు దూరం వచ్చిందా? శ్రీకాకుళం ముఖ ద్వారం ఎచ్చెర్ల పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటాయి. నేను లోకల్ అంటూ గత ఎన్నికల్లో బరిలో దిగిన గొర్ల…
వచ్చే ఎన్నికల నాటికి వారసుడిని బరిలో దించాలన్నది ఆ ఎంపీ ఆలోచన. ఇందుకోసం ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. విషయం తెలుసుకున్న అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బుసలు కొడుతున్నారట. ఇది కాస్తా గుప్పుమనడంతో రెండువర్గాల మధ్య వార్ ఓ రేంజ్‌లోకి చేరుకుంది. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం. తనయుడి కోసం ఎంపీ మాగుంట కొత్త ఎత్తుగడ! రాజకీయాల్లో తండ్రి కీలక స్థానంలో ఉంటే.. తనయులు ఆయన్ని అనుసరించడం కామన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా పాలిటిక్స్‌లో…
పేకాట పేకాటే.. అనుచరులు అనుచరులే. ఇదే ఇప్పుడు గుంటూరు జిల్లా వైసీపీ, పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్. ఇటీవల జరిగిన ఓ ఘటన ఏకంగా ఖాకీలకు చుక్కలు చూపించిందట. నేతల ఒత్తిళ్లు తట్టుకోలేని పోలీసులు పేకాట ఆడుతూ దొరికిన వాళ్లను వేరే జిల్లాలో వదిలేయాల్సి వచ్చింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రూటు మార్చిన పేకాట మాఫియా! గుంటూరు జిల్లా పేకాటకు హబ్‌గా మారింది. జిల్లాలో కొంతమంది అధికారపార్టీకి చెందిన నేతలు పేకాట ఆడిస్తున్నారని ఓపెన్‌గానే చెబుతున్నారు.…
ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోయినా.. ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఇన్నాళ్లూ ఆశించారు. చివరకు ఆ ముచ్చట కూడా అయిపోయింది. రాష్ట్రస్థాయి పదవి కాదు కదా.. కనీసం జిల్లా స్థాయి పోస్టుల్లోనూ వారికి చోటు దక్కలేదు. ఏదో ఆశిస్తే.. ఇంకేదో అయిందని వాపోతున్నారట సీనియర్లు. మెడలో కండువా ఉన్నా.. చేతిలో పదవి లేక తెగ మథన పడుతున్నారట. ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం. పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నారా .. లేరా? వైసీపీ ఆవిర్భావం…
ఎన్నికల్లో గెలిస్తే ఆ లెక్క వేరు. గెలిపించే సత్తా ఉంటే ట్రీట్మెంట్ ఇంకోలా ఉంటుంది. ఆ నాయకుడు ఈ రెండు కేటగిరీల్లోకి రాలేదో ఏమో.. ఆటలో బొప్పాయిలా మారిపోయానని ఆవేదన చెందుతున్నారట. పదవులు లభించినవారు వచ్చి కలుస్తుంటే… అభినందించి పంపుతున్నారు. ఇదే సమయంలో తనకు ఎలాంటి పదవి దక్కలేదని ఎవరికీ చెప్పుకోలేక… నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నారట. ఆయనెవరో ఈ స్టోరీలో చూద్దాం. బొప్పనకు దక్కని నామినేటెడ్ పోస్ట్! బొప్పన భవకుమార్. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున…
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా.. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వచ్చిన ఇగో క్లాష్.. మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కంగారెత్తించింది. అధికారులు.. ప్రభుత్వ వర్గాల్లోనూ పెద్దచర్చగా మారింది. సమస్యకు విరుగుడు మంత్రం వేసినా.. తెర వెనక జరిగిన కథ మాత్రం ఏపీ సచివాలయంలో ఆసక్తి రేకెత్తించింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. కీలక విభాగాలను తప్పించడంతో డిప్యూటీ సీఎంలు కలవరం! రెవెన్యూ శాఖలో అంతర్భాగంగా ఉండే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు.. వాణిజ్య పన్నుల విభాగాలను ఆర్థికశాఖకు బదలాయిస్తూ…