అది ఏటా వందకోట్ల ఆదాయం వచ్చే ఆలయం. ఎవరు గుర్తించరని అనుకున్నారో.. ఇంతకంటే మంచి తరుణం రాదని భావించారో.. చేతివాటం ప్రదర్శిస్తున్నారట. కమీషన్లు పెంచి ముడుపులు దండుకున్నారట. నిధులు దారి మళ్లించడంలోనూ వారి తర్వాతేనని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దాతలు ఇచ్చే దాంట్లో ఎవరిది చేతివాటం? భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అన్నవరం సత్యనారాయణ స్వామి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ పాలకమండలి ఛైర్మన్ రోహిత్. ఈవో త్రినాథ్. దేవుడికి వచ్చే ప్రతి…
చిన్న కార్యకర్తకు కష్టమొచ్చినా.. నేనున్నంటూ వాలిపోతారు ఆ జిల్లాలోని టీడీపీ నేతలు. అరెస్ట్‌లు చేస్తే అక్రమమని అండగా నిలుస్తారు. అలాంటిది పార్టీలో ముఖ్యమైన నాయకుడి కుటుంబానికి ఇబ్బందొస్తే సొంతవారితోపాటు పార్టీవాళ్లెవరూ కిమ్మనలేదు. టీడీపీలో ఎవరా ముఖ్యనేత? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? 2019 తర్వాత రాజకీయంగా ఎదురు దెబ్బలు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం.జిల్లాతోపాటు టెక్కలిలోనూ వారి ఆధిపత్యం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ…
చాలారోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అడిగిన వాటన్నిటికీ ఓకే చెప్పేశారు కూడా. ఆ భేటీ ముగిసిన వెంటనే.. కాంగ్రెస్ నాయకుల చుట్టూ విమర్శల జడివాన ముసురుకుంది. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ప్రశ్నలు నేతల ఉన్నాయట. ఏడేళ్ల తర్వాత సీఎం ఎందుకు పిలిచారో ఆలోచించలేదా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ప్రగతి భవన్‌కి వెళ్లడం పార్టీలో వివాదంగా మారుతోంది. సీఎం కేసీఆర్‌తో భేటీని వ్యూహం కాదు.. వ్యూహాత్మక తప్పిదమన్నది కొందరు నేతల…
ఆ జిల్లాలో మాజీ ప్రజాప్రతినిధుల ఆరాటం ఒక్కటే. ఎమ్మెల్సీ మాకు కావాలంటే మాకు కావాలని ట్రై చేస్తున్నారు. గతంలో చేసిన త్యాగాలు.. ప్రస్తుతం తమ పొజిషన్.. ఫ్యూచర్లో ఎదురయ్యే సమస్యలు ఏకరవు పెడుతూ అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారట. జిల్లా కేంద్రం నుంచి విజయవాడకు ఎక్కని వాహనం.. దిగని వాహనం లేదన్నట్టు క్యూ కడుతున్నారట. ఎవరా నాయకులు? పార్టీ పెద్దలు వారికిచ్చిన హామీలేంటి? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం కర్చీఫ్ అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోందని ఎమ్మెల్సీ పదవి…
తొందరపడి ఓ కోయిల ముందే కూసిందా? అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటా? పీసీసీ సారథి నియామకం విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న చర్చ ఏంటి? పీసీసీ చీఫ్ ఎంపిక జాప్యానికి ఆ ఇద్దరు నాయకుల భేటీనే కారణమా? ఇంతకీ ఎవరా నాయకులు? ఇద్దరు నాయకుల భేటీనే కొంప ముంచిందా? తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ ఎంపిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదిగో.. అదిగో అంటూ చెప్పుకోవడమే తప్ప.. అయ్యింది లేదు… పోయింది లేదు. ఇక నోట్ రెడీ అవ్వడమే…
హుజురాబాద్‌లో టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని ఎంచుకుందా? గత ఉపఎన్నికలకు భిన్నంగా పార్టీలో సీనియర్లను రంగంలోకి దించుతున్నారా? ఆసక్తి రేకిత్తిస్తోన్న గులాబీ శిబిరం ఎత్తుగడలను ఈ స్టోరీలో చూద్దాం. హుజురాబాద్‌పై పూర్తిస్థాయి పట్టుకోసం దృష్టి ఎన్నికల్లో టీఆర్ఎస్ స్ట్రాటజీ పక్కాగా ఉంటుంది. ఉపఎన్నికల్లో అంతకు మించిన వ్యూహాలు అధికార పార్టీ సొంతం. ఇప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్‌లోనూ అలాంటి వ్యూహాలకే పదునుపెడుతోంది గులాబీ పార్టీ. ఉపఎన్నిక…
ఆ జిల్లాలో నేతల మధ్య మెడికల్ కాలేజీ అంశం ప్రకంపనలు సృష్టిస్తోందా? ఎవరికి వారు తమ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నారా? అందుకు తగ్గట్టుగానే అధికార పార్టీ నేతలు పావులు కదుపుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది? ఇంతకీ ఏంటా జిల్లా? ఎవరా నాయకులు? మెడికల్ కాలేజీ కోసం అధికార, విపక్షాలు ఉద్యమం మంచిర్యాల జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి అలా చెప్పారో లేదో ఇటు జిల్లాలో అధికార…
పలాసలో రాజకీయం సలసలా కాగుతోంది. మంత్రి.. విపక్షపార్టీ ఎంపీ ఇద్దరూ ఒక్కచోటే ఫోకస్ పెట్టడంతో హీట్ పెరిగింది. దూకుడుగా వెళ్తున్నారు. అక్కడేం జరుగుతుందా అని జిల్లా అంతా చూస్తున్న పరిస్థితి. ఇంతకీ ఎవరా నాయకులు? పలాస పొలిటికల్ స్క్రిన్‌పై మారుతున్న రంగులేంటి? పలాసలో మంత్రి వర్సెస్ టీడీపీ ఎంపీ! పేరుకి వెనకబడిన ప్రాంతమే అయినప్పటికీ శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హీటు పుట్టిస్తూనే ఉంటాయి. నాయకుల మధ్య సాగే మాటలయుద్ధం రాష్ట్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో…
దేశంలో కొత్త ఫ్రంట్ పై చర్చలు మొదలయ్యాయి. ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు ఫ్రంట్ పై అడుగులు వేస్తున్నారు. మరి దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు ఎటువైపు? 2019 ఎన్నికల ముందు యాంటీ మోడీ ఉద్యమం చేసిన టీడీపీ చీఫ్ ఇప్పుడు ఏం చేస్తారు? మోడీ వ్యతిరేక జట్టుతో కలిసే ధైర్యం చేస్తారా? లేక మా రాష్ట్రం మా రాజకీయం అని ఏపీకే పరిమితం అవుతారా? 2019 ఎన్నికల టైమ్‌లో మోడీకి వ్యతిరేకంగా ఉద్యమంటీడీపీ జాతీయ రాజకీయాలపై మౌనం దేశంలో…
బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక సందర్భంగా నేతల మధ్య పొరపచ్చాలు వచ్చాయా? ఆయన చేరికను తమ ఖాతాలో వేసుకునేందుకు కొందరు ప్రయత్నించారా? ఆ ప్రచారానికి చెక్ పెట్టేలా.. హుజురాబాద్‌లో ఇంఛార్జ్‌ల నియామకం జరిగిందా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎవరు ఎవరికి చెక్ పెట్టారు? ఈటల చేరిక సందర్భంగా జరిగిన పరిణామాలపై చర్చ! తెలంగాణ బీజేపీలో బయటకు అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తోందట. సీనియర్ల మధ్య పడటం…