అధికార పార్టీలో ఆయన సీనియర్ నేత. సీఎంకి దగ్గరి బంధువు కూడా. కానీ ఆయన ఇప్పుడు సంతృప్తిగా లేరట. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావిస్తున్న ఆయనకు నిరాశే మిగిలింది. ఇప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకాలని.. చక్రం తిప్పాలని చూస్తున్న ఆ నేత ఫ్యూచర్ ఎలా ఉంటుందో? ఇంతకీ ఎవరాయన? 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచారు అధికార పార్టీ వైసీపీలో టీటీడీ తాజా మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చర్చగా…
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి.. మాజీ మంత్రికి పడటం లేదట. పెత్తనం కోసం ఇద్దరూ ఫైటింగ్ చేస్తున్నారు. రెండువర్గాలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. అదికాస్తా స్థానికంగా అధికారపార్టీలో రచ్చగా మారుతోంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం? జహీరాబాద్ టీఆర్ఎస్లో మాణిక్‌రావు వర్సెస్ ఫరీదుద్దీన్! మాణిక్‌రావు. ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే. ఇదే నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నేత.. మాజీ మంత్రి ఫరీదుద్దీన్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. విభేదాలు తారాస్థాయికి చేరినట్టు పార్టీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.…
అప్లయ్.. అప్లయ్ .. బట్ నో రిప్లయ్..! ఏపీ ఎక్సైజ్ శాఖకు ఈ సినిమా డైలాగ్ అతికినట్టు సరిపోతుంది. అవినీతి, అక్రమాలపై మంత్రి పూర్తిస్థాయి నివేదిక కోరినా.. అది బయటకు రాదు. తప్పు చేసిన వారిపై చర్యలూ ఉండవు. మంత్రినే ఏమార్చే ఘనులు అక్కడ తిష్ఠ వేశారు. పెద్ద గూడుపుఠాణి నడుపుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎక్సైజ్ శాఖలో లోపం ఎక్కడుంది? తెర వెనక ఉన్నది ఎవరు? గత ప్రభుత్వ హాయాంలో ఎక్సైజ్ శాఖలో అవినీతి…
అయినవాళ్లకు ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్నట్టుంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ తీరు. ఐదేళ్ల తర్వాత డిపార్ట్మెంట్లో అందరికీ ప్రమోషన్లు ఇచ్చి కేవలం ఏడుగురికే రహస్యంగా కీలక పోస్టింగ్‌లు ఇవ్వడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. అదనపు బాధ్యతల పేరుతో కొందరు ఐదేసీ పోస్టులను పర్యవే క్షించడం.. 6 నెలలుగా ఎంతోమందిని పెండింగ్‌లో పెట్టడం వివాదం అవుతోంది. ఇంతకీ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతోంది? ఎక్సైజ్‌శాఖలో పదోన్నతులు వచ్చినా పాతచోటే పని! ఈ ఏడాది జనవరిలో తెలంగాణ…
అప్పు పుట్టేదెలా? ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. కొంతకాలంగా ఏదోరకంగా రుణం తేవడం.. బండి నడిపించడం ఆర్థికశాఖ అధికారులకు అలవాటైంది. ఇప్పుడు కేంద్రం పరిమితులు విధించింది. భారీగా కోత పెట్టింది. మరి.. ఇప్పుడెలా? ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? ఈ ఆర్థిక సంవత్సరం రూ.42,472 కోట్లు అప్పుగా తేవాలని నిర్ణయం! ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా.. సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడా వెనకాడకుండా గట్టిగానే ముందుకెళ్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో అప్పుల కోసం…
జై శ్రీరాం నినాదం లేకుండా బీజేపీ నేతల ప్రసంగాలను ఊహించలేం. కాషాయ కండువా కప్పుకొనేవాళ్లు ఎవరైనా.. కొత్తలో కొంత ఇబ్బంది పడినా తర్వాత ఇలాంటి స్లోగన్స్‌కు అలవాటు పడతారు. కానీ.. ఆ మాజీ మంత్రికి ఇంకా బీజేపీ బాడీ లాంగ్వేజ్ వంటబట్టలేదట. కమ్యూనిస్ట్ బ్యాక్ గ్రౌండ్ వల్లో ఏమో.. ఆయన తీరు వినూత్నంగా ఉందట. అదే ఇప్పుడు కాషాయ శిబిరంలో చర్చగా మారింది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఈటల నోటివెంటరాని జైశ్రీరాం నినాదం! ఈటెల రాజేందర్. మాజీ…
పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. ఏపీ పరిపాలనలో ప్రస్తుతం ఆ రుచులపైనే చర్చ జరుగుతోంది. ఉత్తరాది వారి హవా ఎక్కువగా ఉందనే చర్చ జోరందుకుంది. IAS, IPSలతోపాటు.. కీలక పదవుల్లో సైతం రిటైరైన ఉత్తారాది అధికారుల పేర్లే వినిపిస్తున్నాయట. అదేలాగో ఇప్పుడు చూద్దాం. నార్త్ వర్సెస్ సౌత్ అంశంపై ఏపీలో ఆసక్తికర చర్చ పరిపాలనలో నార్త్ వర్సెస్ సౌత్ అనేది గతంలో ఉంది.. ఇప్పుడూ ఉంది. ప్రభుత్వంలో కీలక స్థానాలు లేదా ఫోకస్ ఉండే శాఖల్లో ఉత్తరాది…
మంత్రిగారి ఇలాకాలో తనిఖీలు లేదా దాడులు చేయాలంటే అధికారులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఆ అమాత్యుడి నియోజకవర్గంలో ఏకంగా ACB ఎంట్రీ ఇచ్చింది. ప్రతి రికార్డును నిశితంగా పరిశీలించడంతో ఒక్కటే గగ్గోలు.. ఉద్యోగవర్గాల్లో కలకలం. కానీ.. ACB దాడుల వెనక అసలు సంగతి వేరే ఉందట. అదే అక్కడ హాట్ టాపిక్! బందర్ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలపై చర్చ! ఇటీవల కృష్ణా జిల్లా బందరు మున్సిపాల్టీలో పెద్దఎత్తున ఏసీబీ సోదాలు జరిగాయి. మున్సిపల్ రికార్డులను తనిఖీలు…
ప్రస్తుతం దేశంలో కాకలుతీరిన రాజకీయ నాయకుల కంటే.. వ్యూహకర్తలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ విషయంలో ప్రశాంత్ కిశోర్ టాప్‌లో ఉంటే.. ఇప్పుడు ఆయన శిష్య బృందానికి సైతం గిరాకీ పెరిగింది. తెలంగాణలో రాజకీయంగా నిలబడాలని చూస్తోన్న YS షర్మిల.. ఆ బృందంలో నుంచి ఒకరిని వ్యూహకర్తగా ఎంచుకున్నారట. ఆ వ్యూహకర్త సూచనలతో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించారట. షర్మిల పార్టీ వ్యూహకర్తగా పీకే టీమ్‌లోని ప్రియ! ఈ నెల 8న తెలంగాణలో కొత్త పార్టీ పేరు ప్రకటించబోతున్న…
బీజేపీలో ఈటల చేరికతో రుసరుసలాడుతోన్న ఆ కమలనాథుడు.. పార్టీతో తెగతెంపులు చేసుకోబోతున్నారా? పక్కచూపులు చూస్తున్నారా? కమలానికి గుడ్‌బై చెప్పడమే మిగిలిందా? ఇంతకీ ఎవరా నాయకుడు? రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? బీజేపీకి గుడ్‌బై చెప్పబోతున్నారా? బీజేపీలో కొత్తగా చేరిన వెటరన్స్ పక్కచూపులు చూస్తున్నారట. పార్టీ నుండి జారుకునేందుకు మార్గాలు వెతుకుతున్నట్టు సమాచారం. ఈ జాబితాలో మాజీమంత్రి ఇనగాల పెద్దిరెడ్డి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఆయన కమల పార్టీని వదిలేసినట్టేనని బీజేపీ వర్గాలు ఒక అభిప్రాయానికి వచ్చాయట.…