అసలే పార్టీ కష్టాల్లో ఉంది..నేతలంతా సపోర్ట్ గా ఉండాలి.. లోటు పాట్లు సర్దుకుపోవాలి..కానీ, ఇక్కడ జరుగుతున్నది రివర్స్..ఎటూ కఠిన చర్యలు తీసుకోలేరని అలుసుగా భావిస్తున్నారా? టీ కాంగ్రెస్ నేతల దూకుడుకు కారణాలేంటి? కాంగ్రెస్ అంటేనే కలహాల కాపురం. అయితే…తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ రేవంత్ వచ్చిన తర్వాత… క్రమశిక్షణకి ప్రాధాన్యత అనే ఇండికేషన్ పంపించారు. దీంట్లో భాగంగానే… గాంధీ భవన్ లో పాస్ ల కోసం గొడవ పడ్డ ఇద్దరిలో ఒకరిని పార్టీ నుండి బయటకు…
ఏపి రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైందా ? రెండున్నరేళ్ల ముందే ఎన్నికల పొత్తుల మాట తెరపైకి వస్తోందా? మాజీ మంత్రి పితాని జనసేనపై చేసిన వ్యాఖ్యల వెనుక కారణం ఏంటి? జనసేనతో ప్రయాణంపై టిడిపిలో ఉన్న మాటే ఆయన చెప్పారా? ఈ చర్చ ఎటువెళుతోంది? దీనిపై బిజెపి ఏమంటోంది? ఏపి లో ఎన్నికలు జరిగి రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ, 2024 లో జరిగే ఎన్నికల్లో పొత్తుల చర్చలు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. ఏపిలో ప్రస్తుతానికి…
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలను వదిలేసి.. ఇతర విషయాలను ఏపీ టీడీపీ ఎంచుకుంటోందా? డ్రగ్స్ విషయంలో టీడీపీ ఆరోపణలపై జరుగుతున్న చర్చ ఏంటి? చేతిలో ఉన్న అస్త్రాలను విడిచిపెట్టి.. పసలేని వాదన చేస్తున్నట్టు పార్టీలోనే చెవులు కొరుక్కుంటున్నారా? డ్రగ్స్ కేసులో టీడీపీ విమర్శలపై పార్టీలోనే భిన్నమైన చర్చ! ఏపీలో డ్రగ్స్ రాజకీయం రచ్చ రేపుతోంది. ఒక్క గ్రాము మత్తుపదార్ధం దొరకలేదు. ఒక్క వ్యక్తీ ఇక్కడ అరెస్ట్ కాలేదు. కానీ.. 21 వేల కోట్ల డ్రగ్స్ సరఫరాకు ఏపీనే…
ఆయనో సీనియర్ నాయకుడు. ఆ జిల్లాలో ఒకానొక సమయంలో చక్రం తిప్పారు కూడా. భవిష్యత్ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ జీవితమే క్వశ్చన్ మార్క్‌గా మారిపోయింది. ఉన్నచోట ఇమడలేక.. పాతగూటికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? పార్టీ మార్పుపై మరోసారి దృష్టిపెట్టారా? కొత్తపల్లి సుబ్బారాయుడు. ఉమ్మడి ఏపీలో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా ఎదిగిన సుబ్బారాయుడు.. ప్రస్తుతం ఏ…
ఆ జిల్లాలో టీడీపీకి మరోసారి ఇబ్బందులు తప్పలేదు. పేరుకు ఎన్నికలు బహిష్కరణ అని చెప్పినా.. బ్యాలెట్ పేపరుపై పార్టీ సింబల్ ఉంది. అభ్యర్థులు ప్రచారం చేశారు. కానీ.. ఓట్లు రాలేదు. సెంటిమెంట్ పండలేదు. పార్టీ వర్గాల్లో ఇదే చర్చ. ఇంతకీ ఏంటా జిల్లా? అధికారం కోల్పోయాక అసలు సంగతి గుర్తించారా? టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో కొన్నేళ్లుగా పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2014 ఎన్నికల వరకు పార్టీ పరిస్థితి బాగానే ఉన్నా.. అధికారంలోకి వచ్చాక…
ఇటీవల కాలంలో ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకు అన్నీ తలనొప్పులే. కనీసం కంటి నిండా నిద్ర కూడా పడటం లేదట. లేఖలు పరేషాన్ చేస్తున్నాయట. ఇక నిరసనలు, ధర్నాలు సరేసరి. అవి ఎవరు చేశారో.. ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోవచ్చు. కానీ.. సీఎమ్‌కు లేఖలు రాస్తుండటంతో ఉలిక్కి పడుతున్నారట ఎమ్మెల్యే. ఆయనెవరో.. ఆ సమస్యేంటో ఈ స్టోరీలో చూద్దాం..! సమస్యలపై నేరుగా సీఎమ్‌కే నిరసనకారుల లేఖలు? రాథోడ్ బాపురావ్. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే. ఇంతకాలం నియోజకవర్గంలో హ్యాపీగా…
అధికారపార్టీలో చిన్న పదవైనా ఎంతో డిమాండ్ ఉంటుంది. దానికి సెంటిమెంట్ కూడా తోడైతే పోటీ చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి ఓ పదవి కోసం విపరీతమైన పోటీనే నెలకొంది. కాకపోతే పాత విద్యార్థి.. కొత్త విద్యార్థి అనే పేరుతో యువ నేతల మధ్య రేస్ మొదలుకావడంతో ఆ పదవిపై ఉత్కంఠ పెరుగుతోంది. టీఆర్ఎస్వీ అధ్యక్ష పదవి కోసం పోటీ! సంస్థాగత పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది అధికారపార్టీ టీఆర్ఎస్. సెప్టెంబర్ 2 నుంచి పార్టీ నేతలంతా ఇదేపనిలో ఉన్నారు.…
మాకు అది చెప్పలేదు.. ఇది చెప్పలేదు. తెలంగాణ కాంగ్రెస్‌లో నిత్యం ఇలాంటి పంచాయితీలు ఏవో ఒకటి కామన్. చీమ చిటుక్కుమన్నా హైకమాండ్‌కు వెంటనే ఫిర్యాదు చేసేస్తారు. పేచీలకు అదీ ఇదీ అనే విభజన రేఖ ఏదీ ఉండదు. ప్రస్తుతం అలాంటి ఒక అంశమే పార్టీలో చర్చగా మారింది. గాంధీభవన్‌లో జరిగిన మీటింగ్‌పై కాంగ్రెస్ సీనియర్లు గుర్రు కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతోందని ఉద్యమిస్తోన్న వామపక్ష పార్టీలతో అఖిలపక్ష సమావేశం పేరుతో మీటింగ్ నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్…
ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్నారు. ఇప్పుడు నేరుగా రోడ్డెక్కేశారు. అధికారపార్టీలో చర్చగా మారారు అక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు. వర్గపోరు మళ్లీ రాజుకుని.. సొంత పార్టీలోనే వైరిపక్షాలుగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వారెవరో.. ఆ రగడేంటో ఇప్పుడు చూద్దాం. ఎంపీ భరత్ వర్సెస్ ఎమ్మెల్యే రాజా! తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య విభేదాలు మరోసారి చర్చగా మారాయి. ఇటీవల రాజానగరం నియోజకవర్గంలో ఓ ఘటన యువనేతల మధ్య ఉన్న ఆధిపత్య…
చంద్రబాబు కంచుకోట కుప్పం కోటలు బీటలు వారుతున్నాయా? మెజార్టీ తగ్గడం, పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి అందుకు సంకేతాలా? టీడీపీ వెనకబాటు ఇప్పటి వరకేనా.. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాగే ఉంటుందా? ఏం జరుగుతోంది కుప్పంలో…! కుప్పం బాబు కోటకు బీటలు వారుతున్నాయా?నాటి పంచాయతీ ఎన్నికల్లో 89లో టీడీపీకి దక్కింది 14..! కుప్పం… చంద్రబాబు సొంత నియోజకవర్గం. అక్కడ నుంచి ఆయన ఏడుసార్లు వరసగా గెలుస్తున్నారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లకుండానే గెలిచేస్తున్నారు చంద్రబాబు. అంటే… అక్కడ…