హుజురాబాద్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పార్టీలో గుర్తింపు పొందిన నాయకులు ఎందుకు కనిపించడం లేదు? వారు అలిగారా.. లేక ప్రచారంలో వారి అవసరం లేదని పార్టీ భావించిందా? బీజేపీలో కీలకంగా ఉన్న నాయకులపై జరుగుతున్న చర్చ ఏంటి? హుజురాబాద్ ప్రచారంలో కాషాయ దండు..! హుజురాబాద్ ఎన్నికల ప్రచారం రంజుగా సాగుతుంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాషాయదండు అక్కడికి షిఫ్ట్ అయింది. ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్నారు. చిన్న సభలు.. సమావేశాల్లో పాల్గొని కేడర్‌కు దిశానిర్దేశం…
ఆయనో మాజీ మంత్రి. అధికారంలో లేకపోయినా తనదైన ఎత్తుగడలతో చర్చల్లో ఉంటారు. కొంతకాలంగా హైకమాండ్‌తో దూరం పాటిస్తున్నారు. రాజకీయ భవిష్యత్‌పై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో అంచనాలు వినిపించాయి. కానీ.. హఠాత్తుగా యూటర్న్ తీసుకుని ఇప్పుడు మళ్లీ పార్టీకి విధేయత ప్రకటిస్తున్నారు. ఇంతకీ ఆయనలో వచ్చిన ఈ మార్పునకు కారణం ఏంటి? ఎవరా నాయకుడు? రెండేళ్లుగా గంటా రాజకీయ ప్రయాణంపై చర్చ..! గంటా శ్రీనివాసరావు. విశాఖజిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఒక వెలుగు వెలిగారు.…
జిల్లాలోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ పథకాల లెక్క తెలియదా? లబ్ధిదారుల వివరాలు తెలియకుండానే రాజకీయం చేస్తున్నారా? కొబ్బరికాయలు కొట్టడం.. రిబ్బన్ కటింగ్ చేయడంపై ఉన్న శ్రద్ధ పథకాల ప్రచారంలో చూపెట్టడం లేదా? ఈ అంశాలపైనే ఇప్పుడు పార్టీ పెద్దలు చురకలు వేశారా? ఇంతకీ ఏంటా జిల్లా? ఎవరా ప్రజాప్రతినిధి? కల్యాణలక్ష్మి లబ్ధిదారుల వివరాలు అడిగే సరికి నీళ్లు నమిలారట..! టీఆర్ఎస్ ప్లీనరీ.. విజయగర్జన సభ కోసం కొద్దిరోజులుగా నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ…
మంత్రి అవునంటే.. కార్పొరేషన్ ఛైర్మన్ కాదంటారు. ఛైర్మన్ ఓకే చెబితే.. మంత్రి నో అంటారు. ఇద్దరి మధ్య నెలకొన్న పవర్ ఫైట్ వల్ల కొన్నాళ్లుగా కీలక నిర్ణయాల్లేవ్. అన్నీ సమస్యలే. ఇంతకీ ఎవరువారు? ఏంటా విభాగం? లెట్స్ వాచ్..! కలిసి సమీక్షల్లేవ్.. కీలక నిర్ణయాలు లేవు..! గంగుల కమలాకర్. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి. మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్. ఇద్దరి మధ్య మొదటి నుంచి సత్సంబంధాలు లేవు. ఒకరు ఎడ్డెమంటే.. ఇంకొకరు…
సాధారణ ఎన్నికలైనా.. ఉపఎన్నికైనా రోడ్‌షోలు.. బహిరంగ సభలు కామన్. ఈ రెండు లేకుండా సాగుతోంది హుజురాబాద్ బైఎలక్షన్. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోనూ సభలకు EC నో చెప్పడంతో ప్రత్యామ్నాయాలపై పడ్డాయి పార్టీలు. ఇంతకీ ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలపై పార్టీలు హ్యాపీగా ఉన్నాయా.. బాధపడుతున్నాయా? ఆంతరంగిక చర్చల్లో జరుగుతున్న సంభాషణలేంటి? ఈసీ ఆంక్షలపై హుజురాబాద్‌లో చర్చ..! హుజురాబాద్‌లో ఈ నెల 30న పోలింగ్.. 27తో ప్రచారం ముగింపు. ప్రచారానికి మిగిలి ఉన్న ఈ కొద్దిరోజులనే కీలకంగా…
గెలుపు పక్కా అనుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణులు.. హుజురాబాద్‌లో ఏ విషయంలో ఆశగా ఎదురు చూస్తున్నాయి? గులాబీ దళపతి లాస్ట్ పంచ్‌పై వేసుకుంటున్న లెక్కలేంటి? కేడర్‌లో ఉత్సాహం తీసుకొచ్చిన ప్రకటన ఏంటి? ఉపఎన్నికపై ప్రభావం చూపేలా కేసీఆర్ బహిరంగ సభ..! గతంలో జరిగిన ఉపఎన్నికలకు భిన్నంగా హుజురాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తోంది టీఆర్ఎస్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు విస్తృతంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. బైఎలక్షన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు అధికారపార్టీ.…
వారం రోజులుగా టీడీపీలో బాలయ్య హాట్ టాపిక్. ఆయన తీరు లాభమో.. నష్టమో.. తేల్చుకోలేకపోతున్నారట తమ్ముళ్లు. సున్నితమైన విషయాల్లో బాలయ్య టచ్ మీ నాట్‌గా ఉండాలని అనుకుంటున్నారా? ఇంతకీ ఏ విషయంలో పార్టీ ఆందోళన చెందుతోంది? లెట్స్ వాచ్..! బాలయ్య వల్ల ఎదురయ్యే కష్టాలపై టీడీపీలో ఆరా? మా ఎన్నికలకు ముందు.. ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలు సినీ ఇండస్ట్రీలో ఎంత చర్చకు దారి తీశాయో.. దాదాపు అంతే చర్చ ఇప్పుడు టీడీపీలో జరుగుతోంది. మా ఎన్నికల్లో…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ జిల్లాల నాయకుల తీరే వేరా? పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో నేతలు ఎందుకు స్తబ్దుగా ఉన్నారు? పార్టీ కార్యక్రమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా? గ్రేటర్‌కు ఆనుకుని ఉన్న జిల్లాలోనూ అదే పరిస్థితి ఉందా? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పీసీసీ కార్యక్రమాలకు నో ఎంట్రీ..! పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండిపోయారు. ఈ రెండు జిల్లాల్లో పార్టీకి బలమైన నాయకత్వమే…
పోటీ చేయడానికి అభ్యర్థిని నిలబెట్టడం వరకు ఓకే..! కానీ.. ఓట్లేయించుకోవడం ఎలా? బద్వేల్లో బీజేపీ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇదేనట..! తాపీగా కూర్చుని డిపాజిట్ లెక్కలు వేసుకుంటున్నారట నాయకులు. ఎలాగో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. 2019లో బీజేపీకి వచ్చింది 735 ఓట్లే..!డిపాజిట్ దక్కేంత ఓట్లు వస్తాయా.. లేదా? బద్వేలు ఉపఎన్నికలో ప్రతిపక్షపాత్ర పోషించేందుకు బీజేపీకి అరుదైన అవకాశం దక్కింది. చనిపోయిన సిట్టింగ్ మెంబర్ కుటుంబానికే టిక్కెట్ కేటాయించడంతో టీడీపీ, జనసేనలు బరిలో నుంచి తప్పుకొన్నాయి.…