అసలే ఆళ్లగడ్డ. రాజకీయాలు ఓ రేంజ్లో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నాళ్లు పొలిటికల్ సందడి తగ్గినా.. ఒక్కసారిగా హైఓల్టేజ్..! పదునైన విమర్శలు.. సవాళ్లు..ఆరోపణలు ఆళ్లగడ్డను అట్టుడికిస్తున్నాయి. ఎందుకిలా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రోడ్ల విస్తరణపై ఆళ్లగడ్డలో రాజకీయ సెగలుకర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ రాజకీయంగా కాక రేపుతోంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఇప్పటికే రాజకీయంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా చేపట్టిన పనులు ఆ విభేదాలకు మరింత ఆజ్యం…
వాళ్లంతా పోలీస్ ఇన్స్పెక్టర్లు. యూనిఫామ్ డ్యూటీలో ఉన్న అధికారులు. సొంతంగా విదేశాలకు వెళ్లితే ఎలాంటి గొడవా ఉండేది కాదు. కానీ.. లిక్కర్ డాన్‌తో మిలాఖతై ఫారిన్ ట్రిప్పులకు వెళ్లి.. థాయ్ మసాజ్‌లు.. క్యాసినో ఆటల్లో మునిగి తేలారట. విషయం తెలిసి పోలీస్ బాస్‌లు కన్నెర్ర చేయడంతో డిపార్ట్మెంట్లో అలజడి మొదలైంది. వాళ్లెవరో లెట్స్ వాచ్..! జల్సాల కోసం విదేశాలకు ఇన్స్పెక్టర్లు..?బ్యాంకాక్‌లో విహార యాత్రలు.. థాయ్ మసాజ్‌లు.. శ్రీలంకలో అమ్మాయిలతో జల్సాలు..క్యాసినో జూదాలు.. ఇవన్నీ పారిశ్రామికవేత్తలో లేక సంపన్నులో…
చేసేదే అక్రమం. ఆ అక్రమాన్ని అడ్డంగా క్యాష్ చేసుకుంటున్నారు ఆ చోటామోటా నేతలు. బిజినెస్ బాగుండటం.. గిట్టుబాటు అవుతుండటంతో కొత్త కొత్త ముఠాలు ఈ దందాలో చేరిపోతున్నాయి. పోటీ పెరగడంతో ఒకరి రహస్యాలను ఇంకొకరు పోలీసుల చెవిన వేస్తూ పెద్ద నేతలకు తలనొప్పిగా మారారట. వేలకు వేలు వస్తుండటంతో కొత్త ముఠాలు ఎంట్రీప్రకాశం జిల్లాలో కొత్తరకం దందాకు తెరలేచింది. ‘జిల్లా’లో తరలించే గ్రానైట్ లారీల నుంచి వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు వసూళ్లు మొదలుపెట్టారు. ఎప్పుడు ఏ లారీ…
అక్కడ నిబంధనలను గాలికి వదిలేశారా? అడ్డగోలు విధానాలతో అక్రమాలకు రాచబాట వేశారా? పక్కా ప్లానింగ్‌తో అవినీతికి పాల్పడుతున్నారా? లోకల్ లీడర్స్ సహకారంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు దండుకుంటున్నారా? ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. లోకల్ లీడర్స్ అండతోనే అక్రమ నిర్మాణాలుఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం.. తిరుపతి. ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్ని తాకితే.. నిర్మాణాలకు భారీ డిమాండ్. ఈ డిమాండే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కొందరు సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. నగరపాలక…
ఆ మున్సిపాలిటీలో ఒకరి వెంట ఒకరు సరెండర్ అవుతున్నారా? మాట వినని వారికి అదే పనిష్మెంటా? కావాలని తీసుకొచ్చినవాళ్లే.. తిరుగు టాపా కట్టించేస్తున్నారా? దీంతో అక్కడికి రావడానికి అధికారులు, ఉద్యోగులు జంకే పరిస్థితి ఉందా? మాట వినకపోతే కౌన్సిల్లో తీర్మానం చేసి సరెండర్ చేస్తున్నారా?ఈ మధ్య కాలంలో కొత్తగూడెం రాజకీయాలు చాలా హాట్ హాట్‌గా ఉంటున్నాయి. వనమా రాఘవ ఎపిసోడ్ తర్వాత అక్కడ చీమ చిటుక్కుమన్నా అటెన్షన్ వచ్చేస్తోంది. ఇప్పుడు కొత్తగూడెం మున్సిపాలిటీ వంతు వచ్చింది. పురపాలక…
తొందరపడి మాట్లాడతారు.. ఆ తర్వాత నాలుక కర్చుకుంటారు. ఇది అధికారపార్టీలో ఓ మంత్రిగారిపై ఉన్న అభిప్రాయం. అలాంటి అమాత్యులవారు ఇప్పుడు అస్సలు పెదవి విప్పడం లేదు. అధిష్ఠానం వద్ద అక్షింతలు లేవు. వేడి తగ్గిందో ఏమో సైలెంట్ అయిపోయారు. ఆయన మౌనం కూడా చర్చగా మారిపోయింది. ఇంతకీ ఎవరా మంత్రి? నోటి దురుసు వల్ల పదవి పొడిగింపు కష్టమనే టాక్ నారాయణ స్వామి. ఏపీ డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఫిర్యాదులు కామన్ అయిపోయాయా? రోజుకో కంప్లయింట్ పీసీసీకి తలనొప్పిగా మారిందా? హైకమాండ్‌కు వివరణ ఇవ్వటానికే టైమ్ సరిపోతోందా? వరస ఫిర్యాదులపై అధిష్ఠానం ఏం చేయబోతుంది? ప్రతి సమస్యపై ఏఐసీసీకి లేఖలు రాసేస్తున్నారా?తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రధాన శత్రువులు ఎక్కడో ఉండరు. సొంత పార్టీలోని నాయకులే.. పార్టీ నేతను కట్టడి చేస్తారు. అనుకున్నది అనుకున్నట్టు అయితే.. ఓకే..! లేదంటే హైకమాండ్‌కు ఫిర్యాదులు కామన్. ఇది కాంగ్రెస్‌లో సర్వసాధారణం. అందుకే కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు.…
ఒక్క ఓటమితో పొలిటికల్ తెరపైనుంచి కనుమరుగయ్యారు ఆ మాజీ మంత్రి. ఇప్పుడు భవిష్యత్ ఏంటో తెలియడం లేదట. ఉన్నచోటే అవమానాలను భరించాలా? లేక పాతచోటుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు ఆ మాజీ మంత్రి. పొలిటికల్ జంక్షన్లో నిలుచుని అటూ ఇటూ దిక్కులు చూస్తున్న ఆ నాయకుడు ఎవరు? ఏమా కథ? కొల్లాపూర్‌లో జూపల్లి ఉనికి ప్రమాదంలో పడిందా?జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ మంత్రిగా పనిచేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నుంచి వరసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గడిచిన…
ఎప్పటి నుంచో ప్రత్యేక ఆదోని జిల్లా కోసం డిమాండ్ ఉంది. తాజా జిల్లాల పునర్విభజన ఆ డిమాండ్‌కు భిన్నంగా ఉండటంతో స్థానికులకు రుచించలేదు. టోన్ పెంచేశారు. ఆ ప్రాంతానికి చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు మాత్రం నోరెత్తడం లేదట. దీంతో వారికేమైంది అని ఒక్కటే ప్రశ్నలు. వారెవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆదోని జిల్లా కోసం ఎప్పటి నుంచో డిమాండ్కర్నూలు జిల్లాలో కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ.. ఇదే జిల్లాలో ప్రత్యేక…