ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీలో ఆసక్తికర చర్చ జరిగిందా? ప్రధానిని ఎవరు రిసీవ్ చేసుకోవాలి.. ఇంకెవరు వీడ్కోలు చెప్పాలన్నదానిపై తర్జనభర్జన పడ్డారా? చివరిక్షణం వరకు జాబితాలో మార్పులు తప్పలేదా? ఈ విషయంలో అసంతృప్తి ఉన్నదెవరికి? సంతోషం కలిగిందెవరికి? మోడీ టూర్లో చివరిక్షణం వరకు బీజేపీ ప్రొటోకాల్ జాబితాలో మార్పులుప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పగానే బీజేపీ నాయకులు.. కార్యకర్తల్లో చాలా ఫీలింగ్స్ కలుగుతాయి. ఇక ఆయన్ని స్వయంగా కలిసే అవకాశం వస్తే.. బీజేపీ బ్యాచ్‌కు…
మొత్తానికి ఏపీలో పీఆర్సీ ఎపిసోడ్ కథ సుఖాంతమైంది. కొన్ని సంఘాలు ఇంకా అసంతృప్తిలో ఉండి ఆందోళనలు కొనసాగిస్తున్నా.. JACలు తమ డిమాండ్స్‌లో ఎంతో కొంత మెరుగ్గా సాధించుకోగలిగాయి. దీంతో ఆ క్రెడిట్ నాదంటే నాదనే గేమ్ మొదలైంది. మేమే సెగ రాజేశాం అంటే.. కాదు మేమే అని పోటీపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ సంఘాల నేతల క్రెడిట్ ఫైట్ఆంధ్రప్రదేశ్లో కొద్ది నెలలపాటు సాగిన పీఆర్సీ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్‌కార్డ్ పడింది. ఫిట్మెంట్ 23 శాతం కంటే ఒక్క…
ఆయన అధికారపార్టీని వీడింది లేదు. కాకపోతే ఎన్నికల్లో ఓడిన తర్వాత సైలెంట్ అయిపోయారు. బయట కనిపించలేదు.. పార్టీ కార్యక్రమాల్లో నల్లపూసయ్యారు. అలాంటి నాయకుడు.. నేను పార్టీలోనే ఉన్నానోచ్ అని చెబుతున్నారట. ఎందుకలా? ఎవరా నేత? ‘నేను టీఆర్ఎస్లోనే ఉన్నా..’ అని చెబుతున్న జలగంఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. అక్కడి పరిణామాలు అనూహ్యంగా చర్చల్లోకి వస్తాయి. అలా అందరి నోళ్లల్లో నానుతుందే కొత్తగూడెం నియోజకవర్గం. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ ఎపిసోడ్ రాజకీయాల్లో…
అధికారం కోల్పోయినా అక్కడి నేతల్లో మార్పు రావడంలేదా? ఆధిపత్య పోరుతో పార్టీ ప్రతిష్ట మంటగలుపుతున్నారా? కీలక నేతలే సొంతగూటిలో చీలికలకు కారణమా? పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా సొంత లాభానికే మొగ్గు చూపుతున్నారా? ఎవరా నాయకులు.. తెరవెనక వేస్తున్న ఎత్తుగడలేంటి? సిక్కోలు జిల్లాలో టీడీపీ కీలకనేతల మధ్య కోల్డ్వార్టీడీపీ కంచుకోట సిక్కోలు జిల్లా. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు పార్టీకి అండగా ఉండి.. మెజార్టీ స్థానాలు కట్టబెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గాలిలోనూ ఒక…
ఆయనో మాజీ ఎమ్మెల్యే. అప్పట్లో మంత్రిగా కొన్నాళ్లున్నారు. అయినప్పటికీ ఏ పార్టీలోనూ పట్టుమని పదేళ్లపాటు కొనసాగలేని పరిస్థితి. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలా.. రిటైర్ అవ్వాలా అన్నట్టుగా ఉన్న పొలిటికల్ కెరియర్‌కు అనుచరుడి కామెంట్స్ తలనొప్పి తెచ్చాయా? గండం నుంచి గట్టెక్కేందుకు ఎవరి మద్దతు కూడగట్టాలో అర్థం కావడం లేదా? ఎవరా నాయకుడు? ఏమా కథ? స్థిరమైన ఆలోచన లేదని పాలేటిపై విమర్శపాలేటి రామారావు. చీరాల మాజీ ఎమ్మెల్యే. 1994, 1999లో చీరాల నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు…
వారిద్దరూ మిత్రులు కాదు. అలా అని శత్రువులు కారు. ఒకరు అధికారపార్టీ అని చెప్పుకొంటున్న ఎమ్మెల్యే. ఇంకొకరు టీడీపీ నేత. అకస్మాతుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దెప్పిపొడుపు మాటలతో తమలోని కళను బయటపెడుతున్నారు. ఆ గిల్లికజ్జాల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో దూషణతూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని రాజోలు రాజకీయాలు ఒక్కసారిగా వాడీవేడిగా మారిపోయాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం మొదలైంది.…
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ వాయిస్ లేదు. మాట్లాడే నాయకుడే కనిపించడం లేదట. చివరకు వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉందట. మరి… ఇంఛార్జ్‌ను అయినా తేలుస్తారా? కేడర్‌కు అందుబాటులో లేని మాజీ ఎమ్మెల్యేచిత్తూరు జిల్లా తంబళ్లపల్లి. ఫ్యూడలిజంతోపాటు విప్లవ భావాలు ఈ నియోజకవర్గంలో ఎక్కువే. గతంలో ఇక్కడ చాలమంది నక్సల్ ఉద్యమంలో పనిచేశారు. అనంతపురం జిల్లాకు సరిహద్దులో ఉంటుంది. దేశమంతా కాంగ్రెస్ హవా ఉన్నప్పుడే తంబళ్లపల్లిలో…
వర్గ రాజకీయాలకు పెట్టింది పేరైన ప్రకాశం జిల్లా చీరాలలో ఓటర్లు విభిన్నంగా తీర్పులు ఇస్తుంటారు. చీరాల నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన 16 శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే.. ఎనిమిదిసార్లు ఇతర పార్టీల క్యాండిడేట్స్ గెలిచారు. ప్రగఢ కోటయ్య, కొణిజేటి రోశయ్య వంటి ఉద్ధండులు చీరాలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా టీడీపీకి కూడా ఇక్కడ బలమైన కేడర్ ఉంది. చేనేత సామాజికవర్గం అధికంగా ఉండే చీరాల నియోజకవర్గంలో ఎస్సీ ఓటు బ్యాంకు కూడా…
ఆ మాజీ ఎమ్మెల్యేకి అన్నీ చింతలేనా? అధికారపార్టీలో ఉన్నప్పటికీ .. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయా? ఎల్ రమణకి ప్రాధాన్యం ఇచ్చాక.. అదే సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలో కలవరం పెరిగిందా? విపక్ష ఎమ్మెల్యేతో అధికారపార్టీ పెద్దలు రాసుకు పూసుకుని తిరగడం బీపీని పెంచుతోందా? మాజీ ఎమ్మెల్యేకు మరిన్ని చింతలుచింతా ప్రభాకర్. సంగారెడ్డి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన.. 2018 ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి మాజీగానే…
ఆయనో మాజీ ఎంపీ. ఎక్కడ ఎన్నికలు జరిగినా జోస్యం చెప్పేస్తారు. ఎవరి బలం ఏంటో ముందే ప్రకటించే ఆయన.. తాను ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పార్టీలు అప్రమత్తం అవుతుంటే.. ఆ మాజీ ఎంపీ మాత్రం సైలెంట్. ఎందుకలా? ఎవరా మాజీ ఎంపీ? కొండాతో కలిసి సాగడానికి సాహసించడం లేదా?మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకసారి కాంగ్రెస్ అధినాయకత్వంపై విమర్శలు చేస్తారు. మరోసారి బీజేపీ పథకాలు, కార్యక్రమాలపై…