Off the Record about Bodhan TRS: బోధన్ టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే వర్సెస్ లీడర్స్,, పొమ్మనలేక పొగ పెడుతోంది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్‌ఎస్‌లో కొంత కాలంగా పార్టీ నేతల మధ్య పొసగడం లేదు. ఎమ్మెల్యే షకీల్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మ భర్త శరత్‌రెడ్డి మధ్య వైరం శ్రుతిమించింది. ఒకే పార్టీ అయినప్పటికీ..చిన్నగా మొదలైన విభేదాలు రెండు వర్గాలను శత్రువులుగా మార్చేశాయి. బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదం కంటే ముందు వరకు.. ఎమ్మెల్యే షకీల్‌కు… శరత్ రెడ్డి ప్రధాన అనుచరునిగా ఉండేవారు. శివాజీ విగ్రహ విషయంలో శరత్ రెడ్డి పాత్ర ఉందని పోలీసులు గుర్తించి కేసు పెట్టడంతో రచ్చ రచ్చ అయ్యింది. అప్పటి నుంచి ఎమ్మెల్యేకు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్తకు గ్యాప్ వచ్చిందని చెబుతారు. ఇదే సమయంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే సోదరుడు సోహెల్ అన్నింటిలోనూ జోక్యం చేసుకోవడం.. ఆ వివాదాలకు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది.
నియోజకవర్గం టీఆర్ఎస్‌లో నెంబర్ 2గా ఎదిగేందుకు శరత్ రెడ్డి ప్రయత్నించడం.. బలం పెంచుకోవడం.. ఎమ్మెల్యే షకీల్‌కు గిట్టలేదని టాక్. ఇంతలోనే శరత్ పార్టీ మారిపోతారనే ప్రచారం ఊపందుకుంది. ఓ ప్రధాన పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఛైర్‌పర్సన్ తూము పద్మ అధికారాలకు ఎమ్మెల్యే కత్తెర వేయడం మొదలు పెట్టారట. మున్సిపల్ కమిషనర్ రూపంలో అధికారాలకు కోత పెడుతున్నారట. దాంతో మున్సిపల్ ఛైర్‌పర్సన్, కమిషనర్ల మధ్య కూడా మరో గొడవ రాజుకుంది. పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కే వరకు సమస్య శ్రుతిమించింది.
Also Read
మున్సిపల్ పాలకవర్గంతో సంబంధం లేకుండా కమిషనర్ సమావేశం అజెండా రూపొందించడం వివాదానికి కారణంగా పైకి కనిపిస్తున్నా.. తెరవెనుక రాజకీయ మంటలు వేరే ఉన్నాయట. అయితే శరత్ ఎదుగుదలను ఓర్వలేక.. ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నారనే వాళ్లూ పార్టీలో ఉన్నారు. బోధన్ టీఆర్‌ఎస్‌లో గొడవల గురించి తెలిసినా పార్టీ పెద్దలు జోక్యం చేసుకోకపోవడం వెనుక వ్యూహం ఉందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అయితే బోధన గులాబీ శిబిరంలో నేతల మధ్య తగువులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయని.. అవి ఎప్పుడు.. ఏ క్షణంలో ఏ విధంగా బరస్ట్ అవుతాయో చెప్పలేమని ఆందోళన చెందుతున్నాయట పార్టీ శ్రేణులు. మరి.. ఈ సమస్యకు పార్టీ పెద్దలు ఎలాంటి పరిష్కారం సూచిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!