Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Off The Record Off The Record Tdp Leader Ganta Mindset Change

Off The Record: గంటా ట్రెండ్ మారిపోయిందా?

Published Date :March 17, 2023 , 9:48 pm
By GSN Raju
Off The Record: గంటా ట్రెండ్ మారిపోయిందా?
  • Follow Us :

ఇన్నాళ్లు పక్కచూపులు చూసిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు ట్రెండు మారే సరికి చూపు మార్చారా? పార్టీకి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సర్వం తానే అనే కలరింగ్ ఇస్తున్నారా? ఇప్పటికైనా ఆ గంట స్థిరంగా గణగణమని మోగుతుందా.. లేక ఓటి మోతేనా..?

అనేక లీకులు ఇస్తారు.. మరెన్నో ప్రచారాలు పుట్టిస్తారనే విమర్శ ఉంది..!
అధికారం ఎక్కడ ఉంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ ఉంటారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో తరచూ వినిపించించే కామెంట్. రాజకీయ ప్రత్యర్థులకైతే ఇదో విమర్శనాస్త్రం కూడా. తన రాజకీయ ప్రయాణం.. ఎత్తుగడలపై ఎన్నో లీకులు.. మరెన్నో ప్రచారాలు పుట్టించుకుని తరచూ చర్చల్లో ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. 20ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఉనికి ప్రశ్నార్ధకమైన ప్రతీసారీ గంటా ప్రచారాలు పీక్స్ కు వెళుతాయని సొంత పార్టీలోని సీనియర్లే పబ్లిక్ గా కామెంట్స్ చేస్తారు. 2019 లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన గంటా శ్రీనివాస్.. టీడీపీ కార్యక్రమాలతో ముడున్నరేళ్ల పాటు ఎటువంటి సంబంధం లేనట్టు వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాలకు మొక్కుబడిగానే వెళ్లి వస్తున్నారు. అధినాయకత్వంతో ఉన్న గ్యాప్ కారణంగా గంటాకు టీడీపీలో ప్రాధాన్యం బాగా తగ్గిందనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈ మాజీ మంత్రి కదలికలు ఉండేవి. పార్టీ మారేందుకు గంటా సీరియస్ ప్రయత్నాలు కూడా చేశారు.

వైసీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు
వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే గంటా అక్కడ వాలిపోతారనే ప్రచారంతో ప్రత్యర్థులు అలెర్ట్ అయ్యారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.. వైసీపీ ముఖ్యనేత బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత కూడా వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తునే వచ్చారు. వైసీపీ ముఖ్యులతో చర్చలు జరిగినప్పటికీ ఆ ప్రయత్నం కొలిక్కి రాలేదు. ఆ తర్వాత జనసేనకు వెళ్లేందుకు గంటా రెడీ అయ్యారనే ప్రచారం జరిగింది. మెగా ఫ్యామీలితో ఉన్న సంబందాలు ఉపయోగించుకుని అక్కడ ఆశ్రయం పొందుతారనే వాదనలు వినిపించాయి. ఐతే., గంటా రూపంలో బలమైన నాయకుడు పార్టీలోకి రావడం వల్ల లాభ నష్టాలను జనసేన చర్చించుకుందట. విశాఖకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను బీచ్ రోడ్ లోని ఓ హోటల్లో కలిశారనే పుకార్లు షికారు చేశాయి. వీటిని ఖండించిన గంటా.. ఆ తర్వాత వైసీపీలో చేరేందుకు ఆసక్తిని చూపించడం చర్చగా మారింది. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు అనివార్యమైతే తాను ఉన్న చోటే భవిష్యత్‌ బాగుంటుందనే అంచనాలు వేసుకున్నారట. పక్క చూపులు ఆపి టీడీపీలో యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు ప్రారంభించారు.

టీడీపీ ఆఫీసుకు వచ్చి కేడర్‌ను ఆశ్చర్య పరుస్తున్న గంటా
కొద్దిరోజులుగా టీడీపీ ఆఫీసుకు వస్తూ.. వెళ్తూ.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ సొంత పార్టీ నాయకులనే ఆశ్చర్య పరుస్తున్నారు గంటా. మొదటి నుంచి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఈ వైరం ఎలా సెట్‌ అవుతుందో కానీ.. టీడీపీ హైకమాండ్‌ దగ్గర వ్యూహకర్తగా నిరూపించుకునే తాపత్రయం గంటాలో ఎక్కువైందనేది హాట్ టాపిక్. ఇటీవల ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో అదే జరిగిందని గంటా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. లెక్చరర్ వేపాడ చిరంజీవి రావును 40రోజుల క్రితం తెరపైకి తీసుకొచ్చారు గంటా. ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు దగ్గరకు పంపించారు. అప్పటికే మాజీ మంత్రి అయ్యన్న ప్రోత్సాహంతో గాడు చిన్నకుమారి లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె ప్రచారం, ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టారు. అయితే, చిరంజీవి రావైతే సామాజికంగా, ఆర్ధికంగా, ఓటర్ల పరంగా బలమైన అభ్యర్థి అనే విషయం గంటానే హైకమాండ్ దగ్గరకు పరోక్షంగా చేర వేశారని టాక్‌. దీంతో మహిళా అభ్యర్థి ప్లేస్‌లో చిరంజీవి రావు వచ్చారు. అంతే.. టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం కూడా చేశారు.

అప్పట్లో వైసీపీపై ప్రశంసలు.. ఇప్పుడు వైసీపీపై విమర్శలు
ఇప్పుడు తన వ్యూహం ఫలించడంతో ఆ క్రెడిట్‌ అంతా తనదే అనే కలర్‌ ఇచ్చే ప్రయత్నాల్లో గంటా ఉన్నారట. అర్ధరాత్రి కౌంటింగ్ సెంటర్ల దగ్గరకు వచ్చి అధికారపార్టీని విమర్శించారు. తాను టీడీపీకి నిఖార్సైన నేతనని చెప్పుకొనే ప్రయత్నం చేశారు. ఫలితం సానుకూలంగా మారిన వెంటనే ఇప్పుడు కొత్త విన్యాసాలు చేస్తున్నారు గంటా. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంశం తెరపైకి తెచ్చాక.. ముఖ్యమంత్రి నిర్ణయం స్వాగతిస్తున్నామని ప్రకటించి సొంత పార్టీనే ఇరుకున పెట్టారు గంటా. అప్పుడు పొగిడిన నోటితోనే ఇప్పుడు వైసీపీ తెగిడేశారు గంటా. తన వియ్యంకుడైన మాజీ మంత్రి నారాయణ రాజకీయంగా ఇబ్బంది పడుతున్నా.. పోలీసు కేసుల చట్రంలో ఇరుక్కుంటున్నా.. గంటా సైలెన్స్‌ వీడి.. కొత్త రాగం అందుకుంటున్నారు. మరి.. గంటానాదం చివరి వరకు ఇదే సౌండ్‌ చేస్తుందో లేదో చూడాలి.

  • Tags
  • ap
  • mla ganta
  • MLC Polls
  • off the record
  • tdp

WEB STORIES

ఉపవాసం ఉంటున్నారా..? అయితే 5 ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి..

"ఉపవాసం ఉంటున్నారా..? అయితే 5 ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి.."

అవకాశాల కోసం  విప్పి చూపిస్తున్న భామలు...

"అవకాశాల కోసం విప్పి చూపిస్తున్న భామలు..."

World Richest Persons: టాప్‌ 10 అపర కుబేరులు వీరే..

"World Richest Persons: టాప్‌ 10 అపర కుబేరులు వీరే.."

పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

"పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.."

Sitara Ghattamaneni: సీతమ్మ వాకిట్లో 'సితార'.. నాన్న పాటతో ఉగాది శుభాకాంక్షలు

"Sitara Ghattamaneni: సీతమ్మ వాకిట్లో 'సితార'.. నాన్న పాటతో ఉగాది శుభాకాంక్షలు"

ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే..

"ఇండియాలో బిజీయెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే.."

Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్

"Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో.. ఆ సమస్యలన్నీ మటాష్"

Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు..

"Health Tips: నిత్యం ఆ పని చేస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు.."

నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న భార్యను చూస్తే..

"నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న భార్యను చూస్తే.."

Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు

"Onscreen Moms: రీల్ అమ్మలు.. రియల్ పేర్లు"

RELATED ARTICLES

MLA Vamsi: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చంద్రబాబు దిట్ట

Kakani Govardhan Reddy: క్రాస్ ఓటింగ్ చేసిన వారికి శిక్ష తప్పదు

Mekapati Chandrasekhar Reddy: మేకపాటి మిస్సింగ్.. ఎక్కడికెళ్ళినట్టు?

Minister Roja: 2024లో టీడీపీకి రెండు సీట్లు కూడా రావు

CM YS Jagan: పోలవరం అంటే వైఎస్‌ఆర్‌.. ప్రారంభించింది నాన్నే.. పూర్తి చేసేది నేనే..

తాజావార్తలు

  • Breaking News : విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. ఈఆర్సీ కీలక నిర్ణయం..

  • Disqualified MLAs-MPs: రాహుల్‌ గాంధీ కంటే ముందు సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే..

  • Rishabh Pant: రిషభ్ పంత్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన గౌరవం

  • Reliance Jio: షాకిచ్చిన జియో.. ఇక, ఆ ప్లాన్‌ మాయం

  • Airtel 5G Plus service: 500 నగరాల్లో 5G సేవలు.. డైలీ డేటా అన్‌లిమిటెడ్

ట్రెండింగ్‌

  • Fan Speed Increase : ఫ్యాన్ స్పీడ్ తక్కువగా ఉందా.. ఎలక్ట్రీషియన్‎తో పన్లేదు మీరే చేస్కోండి

  • Post Office Scheme: రోజుకు రూ.333 పెడితే.. రూ.16లక్షలు మీవే

  • Zebra Crossing: నగర వీధిలో జీబ్రా హల్ చల్.. రోడ్డుపై ఏం చేసిందంటే..

  • Spicy Chilli Chai : పెళ్లి గురించి అడిగే.. చిల్లీ చాయ్ రెసిపీ.. ఇది చాలా స్పైసీ గురూ!

  • Most Valuable Celebrity: బ్రాండ్ వాల్యూ సెలబ్రెటీ.. కోహ్లీని దాటేసిన బాలీవుడ్ స్టార్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions