Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Off The Record Off The Record About Tspsc Chairman Janardhan Reddy

Off The Record: టీఎస్‌పీఎస్సీపై లీకేజీల మచ్చ..! చైర్మన్‌ కంట్రోల్‌ తప్పిందా?

Published Date :March 16, 2023 , 11:08 pm
By Sudhakar Ravula
Off The Record: టీఎస్‌పీఎస్సీపై లీకేజీల మచ్చ..! చైర్మన్‌ కంట్రోల్‌ తప్పిందా?
  • Follow Us :

Off The Record: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అంతా నోటిఫికేషన్లకు తగ్గట్టుగా ప్రిపేర్‌ అవుతున్నారు. కొన్ని పరీక్షలు కూడా జరిగాయి. మరికొన్ని టైం టేబుల్‌ ప్రకారం జరగాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో వచ్చిన సమస్య TSPSCని కుదిపేస్తోందనే చెప్పాలి. AE పోస్ట్‌లకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్‌ కావడం.. దానికి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లోని ఉద్యోగులే పాత్రధారులు కావడంతో సమస్య తీవ్రత ఇంకా పెరిగింది. రాజకీయ పక్షాలతోపాటు వివిధ విద్యార్ధి, యవజన సంఘాలు భగ్గుమన్నాయి. కమిషన్‌ ఆఫీసు దగ్గర ధర్నాలు చేపట్టాయి. ప్రస్తుతం కమిషన్‌ ఆఫీస్‌ ప్రాంగణంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Read Also: Off The Record: రేవంత్‌రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

ప్రస్తుతం అసిస్టెంట్‌ ఇంజనీరు పరీక్షను కమిషన్‌ రద్దు చేసింది. మరో రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. గత ఏడాది అక్టోబరులో జరిగిన గ్రూప్‌ వన్‌ పరీక్ష త్రిశంకు స్వర్గంలో ఉంది. ఓ విధంగా ప్రభుత్వం కూడా ఈ అంశంలో డిఫెన్స్‌లో పడిందనే చెప్పాలి. అలాగే TSPSC విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా మారింది. కమిషన్‌ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి పనితీరుపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫీసును కంట్రోల్‌లో పెట్టడంలో జనార్దన్‌రెడ్డి విఫలం అయ్యారనే విమర్శలు ఊపందుకుంటున్నాయి. TSPSC రాజకీయాలకు అతీతంగా ఉండాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కమిషన్‌ ఛైర్మన్‌గా IAS అధికారిగా పనిచేసిన జనార్దన్‌రెడ్డిని నియమించారు. ఆయనైతే పరీక్షలన్నీ పక్కాగా నిర్వహిస్తారని అనుకున్నారు.

Read Also: Off The Record: అవంతిని టార్గెట్‌ చేసిన జనసేన..! వైసీపీ నేతలకు గాలం..!

అయితే జనార్దన్‌రెడ్డి మెతక వైఖరి కొంప ముంచిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. వేదాంత ధోరణి కమిషన్‌లో పనికి కాదని.. స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకోవాలని పలువురు సూచించారట. అవన్నీ వర్కవుట్‌ కాకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఛైర్మన్‌కు సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో.. ఆఫీసు సిబ్బందిపైనే ఎక్కువ ఆధారపడ్డారనే ఆరోపణలు జనార్దన్‌రెడ్డిపై వస్తున్నాయి. ఆయన కఠినంగా ఉంటే సిబ్బంది తోక జాడించేవారు కాదని.. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని అనుకుంటున్నారు. అసలు కమిషన్‌లోని రహస్య ఛాంబర్లలోకి పెన్‌డ్రైవ్‌లు తెచ్చుకునేంత ధైర్యం సిబ్బందికి ఎలా వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే తమకేం కాదనే లెక్కలేని తనానికి సిబ్బంది వచ్చారని టాక్‌. ఏతా వాతా ఇప్పుడు అన్నీ వేళ్లూ కమిషన్‌ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి సమర్థతవైపు చూపెడుతున్నాయి. కీలక బాధ్యతల్లో ఉండి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఐఏఎస్‌ అధికారిగా ఎలా ఉన్నప్పటికీ.. కమిషన్‌ ఛైర్మన్‌గా ఆయనలోని చేతకాని తనం బయట పడిందని కమీషన్‌ వర్గాలు.. రాజకీయ పక్షాలు అభిప్రాయ పడుతున్నాయట.

  • Tags
  • off the record
  • telangana
  • tspsc
  • tspsc chairman janardhan reddy

WEB STORIES

Tea Pakodi: టీ తో పాటు పకోడీ తింటున్నారా?

"Tea Pakodi: టీ తో పాటు పకోడీ తింటున్నారా?"

Tirumala: శ్రీవారి కొండకు కాలినడకన వచ్చే భక్తులకు గుడ్ న్యూస్

"Tirumala: శ్రీవారి కొండకు కాలినడకన వచ్చే భక్తులకు గుడ్ న్యూస్"

Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)

"Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)"

Costly Liquor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్స్ ఇవే..

"Costly Liquor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్స్ ఇవే.."

పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!

"పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!"

ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు..

"ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు.."

వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!

"వేసవిలో ముఖం నల్లగా మారుతోందా.. ఈ చిట్కాలు పాటించండి..!"

అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే..

"అప్పట్లో బికినీ వేసి ఇండస్ట్రీని షేక్ చేసిన సీనియర్ హీరోయిన్స్ వీరే.."

తరుచూ గ్యాస్ట్రిక్, కడుపు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే

"తరుచూ గ్యాస్ట్రిక్, కడుపు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే "హెచ్ పైలోరీ" ఇన్ఫెక్షన్ కావచ్చు..జాగ్రత్త.."

నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!

"నల్లని పెదవులను తెల్లగా మార్చే చిట్కాలు..!"

RELATED ARTICLES

Top Headlines @5PM: టాప్ న్యూస్

Bhadradri Srirama Navami: శ్రీరామనవమికి భద్రాద్రి ముస్తాబు.. 30న కళ్యాణం

Harish Rao: దానికోసం.. ఎర్రమంజిల్ స్థలం మొత్తం నిమ్స్ కి ఇవ్వాలని సీఎం నిర్ణయం

GHMC Garbage Truck: హృదయ విదారక ఘటన.. చెత్త ట్రాలీ ఢీకొని చిన్నారి మృతి

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

తాజావార్తలు

  • Bus Accident: అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా.. 64మందికి గాయాలు

  • Indrakaran Reddy: మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఇంద్రకిరణ్ సవాల్.. ఏ శిక్షకైనా సిద్ధం

  • Vemula Prashanth Reddy: ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు

  • Balagam: ఓ విశ్వక్.. ‘బలగం’ గట్టి ‘ధమ్కీ’ ఇచ్చినట్టుందే..?

  • Harassment : గదికి రమ్మన్నాడు.. బట్టలు విప్పమన్నాడు.. కీచక టీచర్ దారుణం

ట్రెండింగ్‌

  • IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

  • Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!

  • Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions