Off The Record: చిత్తూరు జిల్లా వైసిపి నేతలకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చిపడింది. తమిళ సూపర్ స్టార్ తలైవా తలనొప్పి తప్పదనే టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిదిగా విచ్చేసిన రజనీకాంత్ టిడిపి అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించటం రాజకీయ ప్రకంపనలు దారి తీసింది. ఐతే ఇది అధికార వైసిపికి ఏమాత్రం మింగుడుపడటంలేదట. చంద్రబాబు లాంటి వెన్నుపోటు దారుడికి మద్దతుగా మాట్లాడుతారా?అంటూ మంత్రి రోజా, కొడాలి నాని, అంబటి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి…
Off The Record: తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా అధికార బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జనానికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది BRS. ఇటీవల జరిగిన సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గెలుపు కోసం ఏం చేయాలనేదానిపై నేతలకు…
Off The Record: ఏం మీ ఇంటి సొమ్ము అనుకున్నారా? సర్కార్ ఇచ్చే దళిత బంధు పథకానికి మూడు లక్షల కమీషన్ అడుతున్నారట…ఉంటారా ..పోతారా అంటూ ఆమధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రెండు నియోజకవర్గాల నాయకుల్ని ఉద్దేశించి అన్నారు సీఎం కేసీఆర్. ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల నేతలకు సీఎం ఆ వార్నింగ్ ఇచ్చారన్నది అప్పట్లో టాక్. అయితే తాజాగా ప్రతినిధుల సదస్సులో కూడా… వసూళ్లు చేసిన ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గరుంది. పద్ధతి మార్చుకోండి అంటూ…
Off The Record: ఈ ఏడాది చివర్లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు కేసీఅర్. వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ … ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే… ఈసారి సిట్టింగ్‌లలో టిక్కెట్లు దక్కేది ఎవరికి? నో చెప్పేది ఎవరికన్న చర్చ మొదలైంది. దీనికి తోడు గురువారం హైదరాబాద్‌లో జరిగిన BRS రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ఎమ్మెల్యేల్లో సెగలు రేపుతున్నాయట. ఒక వైపు ఇప్పటికే పలు…
Off The Record: టీ కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయి నాయకుల మధ్య ఉన్న వైరం కాస్తా.. ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళింది. తమకు నచ్చని, లేదా ప్రత్యర్థి అనుకున్నా నాయకులపై జిల్లా స్థాయిలోనే క్రమశిక్షణా సంఘం పేరుతో అనర్హత వేటు వేస్తున్నారు. బలమైన వర్గం వారికి ఫలానా నాయకుడు నచ్చలేదంటే…అధికారికంగానే పార్టీ నుంచి గెంటేయడం, సభ్యత్వాన్ని రద్దు చేయడం లాంటివి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తున్నట్టు..? క్రమశిక్షణను దారిలో పెట్టాల్సిన నాయకులంతా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్న…
Off The Record: తిరుపతి లోక్‌సభ స్థానం సగం చిత్తూరు జిల్లాలో, సగం నెల్లూరు జిల్లాలో ఉంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ చనిపోవడంతో ఉప ఎన్నికలో సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తి విజయం సాధించారు. వివాదరహితుడు, సౌమ్యుడు అన్న పేరున్నా.. సమస్యల పరిష్కారంలో మాత్రం వెనుకబడ్డారన్నది లోకల్ టాక్. దానికి తగ్గట్టు ఢిల్లీలో బాగానే కనిపిస్తున్నా …నియోజకవర్గంలో మాత్రం అందుబాటులో ఉండటం లేదంటున్నారు. ఎంపీతో పనులుంటే ఎవర్ని…
Off The Record: ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ.. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొందరు సీనియర్ నాయకుల అడుగులు చర్చనీయాంశం అవుతున్నాయి. చాలా మంది నౌ ఆర్ నెవర్ అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకుల అడుగులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతల మీటింగ్‌పై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్…
Off The Record: ఎమ్మార్వో ఆఫీసులు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. ఇతరత్రా గవర్నమెంట్ ఆఫీసులు…ఇలా ఎక్కడైతే ఉద్యోగుల చేతివాటానికి ఆస్కారం ఉంటుందో.. అలాంటి ప్రతి చోట ఏపీ ఏసీబీ విరుచుకుపడుతోంది. సోదాలు నిర్వహిస్తోంది. ఆ దాడులకు భయపడి కొందరు ఉద్యోగులు సెలవులు కూడా పెట్టేశారట. అప్పుడెప్పుడో.. రెండేళ్ళ క్రితం ఇదే తరహాలో హడావుడి చేసిన ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ ఇన్నాళ్ళు ఎందుకు నిద్ర నటించింది? మళ్ళీ ఇప్పుడే ఎందుకు కళ్ళు నులుముకుంటూ లేచిందంటే…దాని వెనక లంబా…
Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఆరు నెలల్లో జరగబోతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఇప్పుడు ఇదే తరహా పోరాటం మొదలైందట. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కొడుకు మధ్య మాటల యుద్ధం నడుస్తోందట. సిట్టింగ్‌లకే సీట్లని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. కొన్ని చోట్ల గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తోందట బీఆర్ఎస్. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారట. మంత్రి…
Off The Record: రాజమండ్రి అర్బన్ టిక్కెట్ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ అవుతోందట. ఈసారి కూడా సీటు తమ కుటుంబానికే ఖరారు చేశారని ఇటీవల సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేసిన ప్రకటనే ఇందుకు కారణమట. పనిలో పనిగా తన కుమారుడు వాసు ఈసారి పోటీలో ఉంటారని కూడా క్లారిటీ ఇచ్చేశారట ఆయన. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్తే వాసు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారాయన. వాళ్ళు…