Coromandel Express: హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదానికి గురైంది. ఈ రైలు ఒడిశాలోని బాలాసోర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. గూడ్స్ రైలును ఢీకొన్న తర్వాత 3 స్లీపర్ కోచ్‌లు వదిలి, మిగిలిన కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం రైలు కోచ్ ల సంఖ్య 18.
Read Also:Ponguleti Srinivas Reddy : ఏ పార్టీ అనేది ఇంకో పది రోజుల్లో చెప్తాం
ఈ కోచ్‌లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకున్నారని, వారిని రక్షించేందుకు స్థానికులు గుమిగూడారని తెలిసింది. ఈ రైలు చెన్నై సెంట్రల్ నుండి కోల్‌కతాలోని షాలిమార్ రైల్వే స్టేషన్ వరకు నడుస్తుంది. శుక్రవారం సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఢీకొనడంతో రైలులోని 18 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏడు బోగీలు ఒకటికి ఒకటి ఢీకొని భారీగా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. 179 మందికి గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Read Also:500Note: భారీగా చెలామణిలో రూ.500ఫేక్ నోట్లు.. వార్తలో నిజమెంత?
చాలా మంది మృతి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ఎలా జరిగిందనే దాని గురించి అధికారిక సమాచారం ఏదీ పంచుకోలేదు. అయితే రెండు రైళ్లు ఒకే లైన్‌లో రావడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. సిగ్నల్ లోపం కారణంగా రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై వచ్చి ఢీకొన్నయని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు భారీగా ధ్వంసమైంది. దాదాపు రైలు మొత్తం పట్టాలు తప్పింది. ఇందులో పలువురు చిక్కుకుపోగా, వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.