Odisha Assembly Elections 2024: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార బీజేడీ ఆధిక్యానికి చెక్ పడేలా కనిపిస్తోంది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో తాజా ఫలితాల ప్రకారం బీజేపీ లీడ్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటి అధిక స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. అదే సమయంలో బీజేడీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 4 సీట్లు మాత్రమే ఇతరుల ఖాతాలోకి వెళ్లనున్నాయి. మెజారిటీకి 74 సీట్లు కావాలి. బీజేపీ తన పనితీరును మెరుగుపరుచుకున్న రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. లోక్ సభ స్థానాల్లోనూ బీజేపీ దూసుకెళ్తోంది ఇక్కడ బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేడీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఒక స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
Read Also: BJP: బీజేపీని దారుణంగా దెబ్బతీసిన యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర..
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 147 స్థానాలకు గాను 117 సీట్లు గెలుచుకుని బీజేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, బీజేపీ 23, కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించాయి. పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ వరుసగా ఐదోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 2000 సంవత్సరంలో తొలిసారిగా ఈ పదవిని చేపట్టారు.