ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు.
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచంలోని పలు దేశాధినేతలతో సహా ప్రధాన మంత్రులు స్పందిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి సంతాపం ప్రకటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో సహా ప్రపంచ నాయకులు తన ప్రగాఢ సంతాపన్ని వ్యక్తం చేశారు.
ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ నుంచి 300 మీటర్ల దూరంలో షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ అనే ఒక రైలు మాత్రమే పట్టాలు తప్పిందని ప్రమాదం తర్వాత ప్రాథమిక నివేదికలు సూచించాయి.
ఈ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం మరియు సరైన విచారణ జరగాలి అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది.. నిజం బయటకు రావాలి.. యాంటీ కొలిజన్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు? అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు.
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంపై క్రీడాకారులు స్పందించారు. ఈ దారుణమైన ఘటనను చూస్తుంటే తీవ్ర వేదన కలుగుతోందని ట్వీట్లు చేశారు.
Rahul Ramakrishna:ఒడిశా రైలు ప్రమాదం గురించి అందరికి తెల్సిందే. దాదాపు 250 మంది మృత్యువాత పడగా.. 900 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన వారికి సంతాపం తెలుపుతున్నారు. చిరంజీవి నుంచి చరణ్ వరకు.. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.