Odisha Train Accident: మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన పెను విషాదాన్ని నింపింది. 275 మంది ప్రయాణికులు మరణించారు. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇదిలా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే బోర్డుతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత అసలు విషయం వెలుగులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Coromandel Express : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షలు అందించనుండగా.. గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనుంది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.
రైలు ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రమాదం కాదు.. సిగ్నలింగ్ పాయింట్‌లో మార్పుల వల్లే ఈ దారుణం జరిగిందని ఆయన వెల్లడించారు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 290 మందికి పైగా చనిపోగా 1100 మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. యావత్ దేశాన్ని కలవరపరిచిన ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం హై లెవల్ కమిషన్ వేసింది.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రమాద ఘటనపై స్పందించారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఒడిశా రైలు ప్రమాద స్థలంలో బాధితులను కాపాడేందుకు శుక్రవారం రాత్రి ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ నిన్న (శనివారం) మధ్యాహ్నం ముగిసిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయని వెల్లడించారు.