Collector Delhi Rao Revealed The Details Of Telugu Passengers in Odisha Train Accident: కోరమాండల్, యశ్వంత్‌పూర్ రైళ్లలో ప్రయాణించిన తెలుగు ప్రయాణికుల వివరాల్ని కలెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు 135 మంది ప్రయాణికులు రావాల్సిందని స్పష్టం చేశారు. ఇందులో 80 మంది క్షేమంగా బయటపడ్డారని, ఏడుగురు క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. 11 మంది ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండగా, 9 మంది అందుబాటులో లేరని తెలియజేశారు. మరో 22 మంది మాత్రం ప్రయాణం చేయలేదని చెప్పారు. వారితో పాటు మరో నలుగురు కాంటాక్ట్‌లో లేరని, ఫోన్ చేయగా అవి రాంగ్ నంబర్లుగా తేలాయని అన్నారు. ఇక యశ్వంతపూర్-హౌరా రైలులో విజయవాడ నుంచి మొత్తం 41 మంది ప్రయాణికులు వెళ్లారని, అందులో నుంచి 21 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులు ఆఖరి నిమిషంలో తమ టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకున్నారన్నారు. ఇద్దరి ఫోన్‌లు స్విచ్చాఫ్ వస్తుండగా, మరో ఇద్దరివి రాంగ్ నెంబర్లుగా తేలాయన్నారు. 8 మంది ఫోన్‌కాల్స్‌కి రెస్పాండ్ అవ్వడం లేదని, మరో నలుగురు అందుబాటులో లేరని అన్నారు. ఒక వ్యక్తి టిక్కెట్ కన్ఫమ్ అయినా.. ప్రయాణం చేయలేదని కలెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు.
Botsa Satyanarayana: ఏపీ నుంచి ఎవరూ చనిపోలేదు.. ఒడిశా రైలు ప్రమాదంపై మంత్రి బొత్స
కాగా.. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఒడిశాలోని రైలు పట్టాలపై మరణమృదంగం మోగింది. సిగ్నలింగ్ వైఫల్యం కారణంగా.. యశ్వంతపూర్-హౌరా ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై కోరమాండ్ ఎక్స్‌ప్రెస్, గూడ్సు రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 290 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 1000 మందికి పైగా గాయాపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం.. తమ రాష్ట్ర ప్రజలకు తక్షణ సహాయం అందించే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రతీ గంటకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అక్కడికి మంత్రి అమర్నాథ్‌తో పాటు పలువురు అధికారుల్ని పంపించారు. గాయాలపాలైన వారిని, చనిపోయిన వారిని అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
Kottu Satyanarayana: చంద్రబాబు 2014లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడు