ICC Cricket World Cup 2023: రికార్డులు అన్నీ బద్దలు కొట్టిన సౌతాఫ్రికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Cricket World Cup 2023: వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది సౌతాఫ్రికా జట్టు.. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 1975లో ప్రారంభమైనప్పటి నుండి అనేక జట్లు తమ అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనలను ఆవిష్కరించాయి. కానీ, ఈ రోజు ప్రపంచకప్ 2023లో జరిగిన శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ ప్రత్యేకం.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంకపై ఐదు వికెట్ల నష్టానికి 428 పరుగుల భారీ స్కోర్ చేసింది.. దీంతో.. 2015 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా పేరున ఉన్న రికార్డును దక్షిణాఫ్రికా బద్దలుకొట్టింది. ఇక, ఒకే ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మన్స్ సెంచరీలు బాదటం మరో హైలైట్.. మూడు సెంచరీలతో 400కు పైగా పరుగులు నమోదు చేసిన తొలి జట్టుగా మరో రికార్డుకు ఎక్కింది సౌతాఫ్రికా..
Read Also: Hamas Attack On Israel: “ఈ దాడి గర్వంగా ఉంది”.. హమాస్ ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతు..
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ఢిల్లీ వేదికగా ఈ రోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ప్లేయర్స్ క్వింటన్ డికాక్ (100), రస్సీ వాన్ డర్ డస్సెన్.. ఐడెన్ మార్‌క్రమ్ సెంచరీలతో కదం తొక్కారు.. ఇక, వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు మార్‌క్రమ్.. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి చెలరేగిపోయాడు.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఓపెనర్ క్వింటన్ డికాక్ 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సహకారంతో 100 పరుగులు చేశాడు.. ఇక, వాన్ డెర్ డస్సెన్ 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 108 పరుగులు బాదాడు.. ఆ తర్వాత ఐడెన్ మార్‌క్రమ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. కేవలం 54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదేసి 106 పరుగులు చేశాడు.. దీంతో.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా 428 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. శ్రీలంక ముందు 429 పరుగుల భారీ టార్గెట్‌ను పెట్టింది.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!