World Cup 2023: వన్డే ప్రపంచకప్ ప్రారంభోత్సవ వేడుకలు లేనట్టేనా.. కారణమేంటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత్‌లో 2023 ప్రపంచకప్ జరుగుతోంది. ఈసారి ప్రపంచకప్ భారత్‌కు అత్యంత కీలకమని చెప్పాలి. స్వదేశంలో కప్ గెలవాలన్న ఆశ ఎవరికైనా ఉంటుంది. మరోవైపు ఎలాగైనా వరల్డ్ కప్ గెలవాలన్న కసితో భారత్ చూస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 10 అత్యంత బలమైన జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ మహాసంగ్రామం కోసం ఇప్పటికే క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ రేపు (అక్టోబర్ 5న) ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగనుంది.
Asian Games 2023: ఆసియా క్రీడల్లో బంగ్లాకు చుక్కలు చూపించిన మలేషియా క్రికెట్ జట్టు..
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
అయితే ఈ ప్రపంచకప్ ప్రారంభోత్సవానికి ముందు క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించడం లేదు. స్పోర్ట్స్ వెబ్‌సైట్ రెవ్ స్పోర్ట్స్ ప్రకారం.. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ బోర్డు(ICC) ఈసారి ఈ వేడుకను నిర్వహించడం లేదని తెలుస్తోంది. అయితే.. ఏదైనా పెద్ద టోర్నమెంట్‌ని ఇండియాలో నిర్వహించే ముందు ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఈసారి మాత్రం క్రికెట్ అభిమానులకు ఆ ఎంజాయ్ మెంట్ ఉండదు. అయితే ఒకవేళ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించి ఉంటే.. పలువురు స్టార్లు ఈ వేడుకలో సందడి చేసే అవకాశం ఉండేది. కానీ ఈ వేడుక రద్దు అవడంతో.. ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.
Maharashtra: నాందేడ్ ఘటన మరవక ముందే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కరోజులో 23 మంది మృతి
ఇదిలా ఉంటే.. కెప్టెన్స్ డే కోసం ప్రపంచ కప్ లో పాల్గొనే 10 మంది కెప్టెన్లు అహ్మదాబాద్‌కు రానున్నారు. ఇక రేపటి నుంచి ప్రపంచ కప్ ప్రారంభమవుతుండగా.. అక్టోబర్ 8న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 14 న అహ్మదాబాద్‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే ఓపెనింగ్ సెర్మనీ కాకుండా.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ఏమైనా గ్రాండ్ ఫంక్షన్‌ను నిర్వహించే ప్లాన్ చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. చూడాలి మరి వరల్డ్ కప్ గ్రాండ్ వేడుక ఎప్పుడు, ఎలా ఉంటుందో.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!