బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)కి ముందు ఆస్ట్రేలియాకు గట్టిదెబ్బ తగిలింది. పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాను తన సొంతగడ్డపై ఓడించింది. మూడో వన్డేలో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయినప్పటికీ.. మిగత రెండు మ్యాచ్‌ల్లో పుంజుకుని సిరీస్‌ను సొంతం చేసుకుంది. 22 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ తన సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది.
Read Also: Accident: ఆలయానికి వెళ్లివస్తుండగా వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు
కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌కి ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్‌కు ముందు బాబర్ అజామ్ కెప్టెన్సీని విడిచిపెట్టగా.. మహ్మద్ రిజ్వాన్ పాకిస్థాన్ వైట్ బాల్ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పెర్త్ వేదికగా జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ 27వ ఓవర్ ఐదో బంతికి 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చారిత్రక ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ సరైన నిర్ణయంతో ఆస్ట్రేలియా జట్టు 140 పరుగులకే కుప్పకూలింది.
Read Also: IND vs SA: నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. మారిన టైమింగ్స్
షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షాలకు చెరో 3 వికెట్లు లభించగా.. హరీస్ రవూఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా తరఫున సీన్ అబాట్ 30 పరుగులు, మాథ్యూ షార్ట్ 22 పరుగులు చేశారు. ఈ ఇద్దరు బ్యాటర్లు తప్ప.. మిగతా ఏ బ్యాట్స్‌మెన్ 20 పరుగులకి మించి పరుగులు చేయలేకపోయారు. పాకిస్థాన్ బ్యాటింగ్‌లో సామ్ అయూబ్ 42 పరుగులు, అబ్దుల్లా షఫీక్ 37 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బాబర్ ఆజం 28 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరఫున లాన్స్ మోరిస్ 2 వికెట్లు తీశాడు.