నవంబర్ 30వ తేదీ నుంచి (ఆదివారం) సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ స్టార్ట్ కానుంది. జార్ఖండ్ లోని రాంచీ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇక, ఈ మ్యాచ్ కి టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ రీ ఎంట్రీతో జట్టు బలంగా కనిపిస్తోంది.
టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రో-కోలు ప్రస్తుతం వన్డేల్లోనే మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరు ఆడారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిట్‌నెస్ వారికి ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో కొనసాగాలంటే.. దేశవాళీల్లో పాల్గొనాల్సిందే అని రో-కోకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 24…
IND vs AUS: ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆసీస్. అయితే, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో కంగారు జట్టు 1 -0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టీ20లలో న్యూజిలాండ్‌పై ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్.. వన్డేలలో కూడా అదే అలవాటుగా మారింది. తాజాగా కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలో పాక్ 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ కేవలం 22 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌పై ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. మొదట ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ అత్యధిక క్యాచ్‌ల రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటింగ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 14,000 పరుగులు పూర్తి చేశాడు.
భారత జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక గొప్ప ఘనత సాధించాడు. "హిట్‌మ్యాన్" గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ, వన్డే క్రికెట్‌లో 11,000 పరుగులు చేసిన రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ తన అత్యద్భుతమైన ఫార్మ్‌తో అద్భుతమైన ప్రదర్శనను కనబరచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను 113 బంతులలో 133 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేన్ 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో తన ప్రతిభతో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టును గెలిపించడమే కాకుండా.. అతని 7,000 వన్డే పరుగుల మైలురాయిని మరింత వేగంగా చేరాడు. విలియమ్సన్ తన 159వ వన్డే ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించాడు. కాగా విరాట్…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. కాగా.. ఈనెల 12న మూడో వన్డే మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి టీం ఇండియా ప్లేయింగ్-11పై ఉండనుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఫ్లడ్ లైట్లు పని చేయకపోవడం వల్ల మ్యాచ్ దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో బీసీసీఐని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో.. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం సీరియస్ అయింది.. వెంటనే చర్యలు చేపట్టింది.
హిట్ మ్యాన్‌గా పేరొందిన రోహిత్ శర్మకు ఏమైంది.. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచినప్పటి నుండి అతను సరిగా ఆడటం లేదు.. దీంతో.. తన బ్యాట్‌కు ఏదో ఒక శాపం తగిలి ఉంటుందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్ర నిరాశ పరిచిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత రంజీలో ఆడాడు. అక్కడ కూడా ఇదే రకమైన ప్రదర్శన కనబరిచాడు.